Rajasthan: రాజస్థాన్ పోలీస్ ఫోర్స్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ !
రాజస్థాన్ పోలీస్ ఫోర్స్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ !
Rajasthan: పోలీస్ ఫోర్స్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరక్ పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పిస్తూ రాజస్థాన్(Rajasthan) పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1989ని సవరించారు. రాష్ట్ర సచివాలంలో బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో పాటు ‘సోలార్ ఎనర్జీ’ అభివృద్ధి భూమి కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. సమావేశానంతరం క్యాబినెట్ నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా, మంత్రి జోగరామ్ పటేల్ మీడియాకు తెలిపారు.
Rajasthan Police Force..
ఈ సందర్భంగా మహిళల సాధికారత, రాష్ట్ర లా ఎన్ఫోర్సెమెంట్ ఏజెన్సీలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జోగరామ్ పటేల్ తెలిపారు. సస్టయినబుల్ ఎనర్జీ ప్రొడక్షన్‌ను పెంచేందుకు సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూములను కేబినెట్ కేటాయించినట్టు చెప్పారు. పునరుత్పతి ఇంధన మార్గాలను ప్రమోట్ చేస్తూ రైతులు, సాధారణ ప్రజానీకానికి తగినంత విద్యుత్‌ను అందించడమే క్యాబినెట్ నిర్ణయం ముఖ్యోద్దేశమని తెలిపారు. కాగా, పారాలంపిక్స్, ఇతర క్రీడాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన అథ్లెట్లకు అదనపు రిజర్వేషన్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం గ్రాట్యుటీ-డిత్ గ్రాట్యుటీని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు పెంచుతూ మరో నిర్ణయం తీసుకుంది.
Also Read : Haryana Assembly Elections: హరియాణా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ !