Rajasthan Row : మేడం చేతిలో రాజ‌స్థాన్ భ‌విత‌వ్యం

ప్ర‌భుత్వ ప‌గ్గాలు ద‌క్కేది ఎవ‌రికో

Rajasthan Row : ఏ పార్టీలో లేని రీతిలో కాంగ్రెస్ పార్టీలోనే సంక్షోభాలు ఎక్కువ‌గా చోటు చేసుకుంటున్నాయి. సీనియ‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా వెళుతుండ‌డం పార్టీ రోజు రోజుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ త‌రుణంంలో దేశంలో కేవ‌లం రెండు రాష్ట్రాల‌లోనే పూర్తి కాల‌పు ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌గ‌లిగింది 134 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ.

ఈ త‌రుణంలో ఒక్క రాజ‌స్తాన్ , చ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో కాంగ్రెస్ కొలువు తీరింది. ప్ర‌శాంతంగా ఉన్న రాజ‌స్థాన్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న‌ట్టుండి సంక్షోభం నెల‌కొనేలా చేసింది. పార్టీకి సంబంధించి అధ్య‌క్ష ప‌ద‌వికి అక్టోబ‌ర్ 17న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇందుకు గాను త‌మ కుటుంబానికి విధేయుడిగా పేరొందిన రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు ప‌చ్చ జెండా ఊపింది హై క‌మాండ్.

ఇందుకు సోనియా గాంధీ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా అసమ్మ‌తి వ‌ర్గం నుంచి తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ బ‌రిలో ఉండ‌నున్నారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి రాజ‌స్థాన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు(Rajasthan Row) 90 మంది ధిక్కార స్వ‌రం వినిపించారు. ఆపై ప‌రిశీకుల‌ను కూ బేఖాత‌ర్ చేశారు.

దీనిని సీరియ‌స్ గా తీసుకుంది హైక‌మాండ్. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు మార్లు సీఎంల‌ను మార్చే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది పార్టీ. ఇది ఒక ర‌కంగా అసంతృప్తిని రాజేసిన‌ట్లేన‌ని భావించ‌క త‌ప్ప‌దు. ఇక ఎమ్మెల్యేల ధిక్కారం వెనుక పూర్తిగా సీఎం గెహ్లాట్ హ‌స్తం ఉంద‌ని భావిస్తోంది పార్టీ.

దీంతో ఆయ‌న‌ను పార్టీ అధ్య‌క్ష రేసు లో నుంచి త‌ప్పించ‌డ‌మే కాకుండా సీఎం ప‌ద‌వికి ఎస‌రు పెట్ట‌నున్న‌ట్లు టాక్. ఈ త‌రుణంలో స‌చిన్ పైల‌ట్ , శాంతి ధారివాల్ , అశోక్ గెహ్లాట్ ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు రాష్ట్ర భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌న్న‌ది వాస్త‌వం. మొత్తంగా మేడం చేతిలోనే ఉంది.

Also Read : రాజ‌స్థాన్ సంక్షోభంలో ‘శాంతి’ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!