SRH vs RR IPL 2022 : రాజస్థాన్ భళా హైదరాబాద్ విలవిల
దుమ్ము రేపిన శాంసన్..పడిక్కల్..హెట్ మైర్ ..చాహల్
SRH vs RR IPL 2022 : కెప్టెన్ మారినా జట్టులో కొత్త ఆటగాళ్లు వచ్చినా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR IPL 2022 )దశ మారడం లేదు. గత సీజన్ లో లాగానే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా తొలి పోరు పూర్తిగా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఓటమి చవి చూసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో తడబడినా ఆ తర్వాత రెచ్చి పోయింది.
ఆకాశమే హద్దుగా చెలరేగింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది.
కెప్టెన్ సంజూ శాంసన్ , యశస్వి జైశ్వాల్, దేవదత్ పడిక్కల్ , హెట్ మెయిర్ దుమ్ము రేపారు. ఇక సంజూ కళ్లు చెదిరేలా సిక్సర్ల మోత మోగించాడు.
దీంతో భారీ స్కోర్ నమోదు చేసింది. 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్(SRH vs RR IPL 2022 ).
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన విలయ్సన్ , నికోలస్ పూరన్ నిరాశ పరిచారు.
211 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ లో శాంసన్ 27 బంతులు ఆడి 55 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్సర్లు 3 ఫోర్లు ఉన్నాయి.
దేవదత్ పడిక్కల్ 29 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లు 41 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఇక హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
మార్క రమ్ 57 , వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు చేసి సత్తా చాటారు. ఇక ఆర్ఆర్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అద్భుతంగా ఆడిన శాంసన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Also Read : యప్ టీవీకి టాటా ఐపీఎల్ టెలికాస్ట్ రైట్స్