Rajasthan Royals IPL 2022 : 14 ఏళ్ల త‌ర్వాత ఐపీఎల్ ఫైన‌ల్ కు

ఎన్నాళ్లకెన్నాళ్ల‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్

Rajasthan Royals IPL 2022 : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ ల‌లిత్ మోదీ సార‌థ్యంలో ప్రారంభ‌మైంది భార‌త్ లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్.

2008లో జ‌రిగిన మొద‌టి రిచ్ లీగ్ ఐపీఎల్ టైటిల్ ను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం, దివంగ‌త క్రికెట‌ర్ షేన్ వార్న్ సార‌థ్యంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్(Rajasthan Royals IPL 2022) తొలి క‌ప్పు చేజిక్కించుకుంది.

ఆ త‌ర్వాత ఐపీఎల్ 2022 వ‌ర‌కు ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది. మ‌ధ్య‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో 2 ఏళ్ల పాటు నిషేధం ఎదుర్కొంది. కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంత‌రం ఫైన‌ల్ కు చేరింది.

జ‌ట్టుకు శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం, మాజీ కెప్టెన్ మిస్ట‌ర్ కూల్ కుమార సంగ‌క్క‌ర హెడ్ కోచ్ గా ఉన్నాడు. బౌలింగ్ కోచ్ గా మాజీ దిగ్గ‌జ శ్రీ‌లంక బౌల‌ర్ ల‌సిత్ మ‌ళింగ ను నియ‌మించింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్(Rajasthan Royals IPL 2022) యాజ‌మాన్యం.

ఈ జ‌ట్టుకు చైర్మ‌న్ గా రంజిత్ బ‌ర్త‌కూర్ ఉండ‌గా . య‌జ‌మానిగా ఎమ‌ర్జింగ్ మీడియా కు చెందిన మ‌నోజ్ బ‌ద‌లే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు

65 శాతం వాటా ఉంది ఇందులో. ల‌చ్లాన్ ముర్దోక్ కు 13 శాతం, రెడ్ బ‌ర్డ్ క్యాపిట‌ల్ భాగ‌స్వాములకు 15 శాతం వాటా ఉంది.

జ‌ట్టు కేరాఫ్ రాజ‌స్థాన్ లోని జైపూర్. 2008లో ఈ జ‌ట్టును ఏర్పాటు చేశారు. హోం గ్రౌండ్ స‌వాయి మాన్ సింగ్ స్టేడియం. రాహుల్ ద్ర‌విడ్

కెప్టెన్సీలో 2013 చాంపియ‌న్స్ లీగ్ టీ20లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచారు.

14 జూలై 2015న 2013 లో జ‌రిగిన బెట్టింగ్ స్కామ్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 2 ఏళ్ల పాటు ఆడ‌కుండా నిషేధం

విధించింది సుప్రీంకోర్టు నియ‌మించిన ప్యానెల్ తీర్పు చెప్పింది.

ప్ర‌స్తుతం టైటిల్ సాధించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. గుజ‌రాత్ పై గెలిస్తే క‌ప్ స్వంతం అవుతుంది.

Also Read : చుక్క‌లు చూపించిన ప్ర‌సిద్ద్ క్రిష్ణ

Leave A Reply

Your Email Id will not be published!