Rajasthan Royals 2022 : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ర‌ఫ్ఫాడిస్తారా

సంజూ శాంస‌న్ పైనే అంద‌రి ఫోక‌స్

Rajasthan Royals 2022 : ముంబైలో ఈనెల 26 నుంచి ప్రారంభ‌మయ్యే ఐపీఎల్ (IPL)మెగా రిచ్ లీగ్ లో అంద‌రి క‌ళ్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఉన్నాయి. శ్రీ‌లంక మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ కుమార సంగ‌క్క‌ర ఇప్పుడు ఈ జ‌ట్టుకు మెంటార్, డైరెక్ట‌ర్.

ఇక భార‌త క్రికెట్ లో స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన ఏకైక ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్. విల‌క్ష‌ణ‌మైన ఆట తీరుతో ఆక‌ట్టు కోవ‌డం అత‌డి స్వంతం.

దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ (IPL)  లో వ్య‌క్తిగ‌తంగా రాణించినా కెప్టెన్ గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును (Rajasthan Royals 2022)గ‌ట్టెక్కించ లేక పోయాడు..

ఈ త‌రుణంలో మ‌రోసారి స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు ఆట‌గాళ్లు. ముమ్మ‌రంగా నెట్ ప్రాక్టీస్ లో నిమగ్న‌మ‌య్యారు.

ఐపీఎల్ (IPL) లో రాజ‌స్థాన్ లోని జైపూర్ నుంచి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు (Rajasthan Royals 2022)ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. మొత్తం 10 ఫ్రాంచైజీల‌లో ఇది ఒక‌టిగా ఉంది. 2008లో దీనిని ప్రారంభించారు.

దీనిని మ‌నీ బాల్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ ఫ్రాంచైజీని అనేక వివాదాలు, కుంభ‌కోణాల‌కు కేరాఫ్ గా మారింది.

దివంగ‌త క్రికెట్ దిగ్గ‌జం ఆసిస్ ప్లేయ‌ర్ షేన్ వార్న్ సార‌థ్యంలో ప్రారంభంలోని ఐపీఎల్ (IPL) టైటిల్ గెలుపొంది.

ఈరోజు వ‌ర‌కు టైటిల్ గెలుచుకోలేక పోయింది. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ సార‌థ్యంలో 2013లో ఐపీఎల్ (IPL) లో రెండో స్థానంలో నిలిచింది. 2015లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings ) ఫ్రాంచైజీల‌పై రెండేళ్ల పాటు బ్యాన్ విధించింది.

దీంతో ఇరు జ‌ట్లు 2016, 2017ల‌లో జ‌రిగిన ఐపీఎల్ (IPL) టోర్నీలో పాల్గొన‌లేదు. 2018లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌హానే 2, 705 ప‌రుగుల‌తో టాప్ లో ఉండ‌గా వాట్స‌న్ 67 వికెట్ల‌తో నెంబ‌ర్ వ‌న్ లో ఉన్నారు.

ప్ర‌స్తుతం సంజూ శాంస‌న్ స్కిప్ప‌ర్ గా ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఈసారి రాజ‌సాన్ని ప్ర‌ద‌ర్శిస్తారా లేక చేతులెత్తేసారా అన్న‌ది వేచి చూడాలి.

ఈసారి జ‌ట్టు ప‌రంగా చూస్తే శాంస‌న్ తో పాటు వ‌ర‌ల్డ్ బెస్ట్ ప్లేయ‌ర్లు ఈ జ‌ట్టులో ఉండ‌డం విశేషం. కాస్తంత ల‌క్ తోడైతే జ‌ట్టు టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంది.

Also Read : జెలెన్ స్కీ ప్ర‌సంగం విస్తు పోయిన ప్ర‌పంచం

Leave A Reply

Your Email Id will not be published!