Rajasthan Royals IPL 2022 : టైటిల్ వేటలో రాజస్తాన్ రాయల్స్
2022లో 2008 రిపీట్ అవుతుందా
Rajasthan Royals IPL 2022 : రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 టైటిల్ చేజిక్కించు కునేందుకు అడుగు దూరంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన రిచ్ లీగ్ గా పేరొందింది.
ఇప్పటి వరకు 14 సీజన్స్ పూర్తి కాగా 15వ సీజన్ ఈనెల 29తో పూర్తవుతుంది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగింది రిచ్ లీగ్.
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ ఏ ముహూర్తాన ఐపీఎల్ ను ప్రారంభించాడో కానీ ఇప్పుడు దాని వాల్యూ ఏకంగా రూ. 50,000 వేల కోట్లకు
పైగా మారింది. ఇప్పటి వరకు గత సీజన్లలో 8 జట్లు పాల్గొన్నాయి.
ఈసారి రెండు కొత్త జట్లు పాల్గొన్నాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ . ఈసారి అనూహ్యంగా కొత్త జట్లు దుమ్ము రేపాయి.
ఇందులో గుజరాత్ ఇప్పటికే ఫైనల్ కు చేరింది. ఇక లక్నో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడి పోయి ఇంటి బాట పట్టింది.
ఇక సంజూ శాంసన్ సారథ్యం లోని రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals IPL 2022) ఈసారి ఏకంగా ఫైనల్ కు చేరింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి కూల్ గా సత్తా చాటింది. నేరుగా ఫైనల్ కు చేరింది. లీగ్ మ్యాచ్ లలో భాగంగా మొత్తం 14 మ్యాచ్ లు ఆడింది రాజస్తాన్.
9 గెలిచి 5 మ్యాచ్ లలో ఓడి పోయి 18 పాయింట్లు సాధించింది. నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరింది. క్వాలిఫయిర్ -1లో గుజరాత్ తో ఓడి పోయింది.
కానీ రెండో క్వాలిఫయిర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించింది రాజస్తాన్ .
7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొత్తం 15 సీజన్లకు గాను ఇప్పటి వరకు ఫైనల్ కు చేరలేదు రాజస్తాన్(Rajasthan Royals IPL 2022). 14 ఏళ్లయింది
ఈ ఫైనల్ కు చేరేందుకు. ఐపీఎల్ ప్రారంభం టైటిల్ ను దివంగత క్రికెటర్ షేన్ వార్న్ సారథ్యంలో టైటిల్ గెలిచింది.
ఇక ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది రాజస్తాన్. 2022లో 2008ని రిపీట్ చేస్తుందా అన్నది తేలనుంది.
Also Read : 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ కు