Rajasthan Royals : ప్లే ఆఫ్స్ దిశగా రాయల్స్ అడుగు
పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో
Rajasthan Royals : దుబాయ్ వేదికగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. కానీ ఈసారి అద్భుత విజయాలు నమోదు చేస్తూ టైటిల్ వేటలో నిలిచి ఉంది.
ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ టాప్ లో నిలిచింది. ఇక మిగతా మూడు స్థానాలలో ప్లే ఆఫ్స్ కు సంబంధించి ఏయే జట్లు వస్తాయనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టోర్నీ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఐపీఎల్ రిచ్ లీగ్ 14 సీజన్లు ముగిశాయి.
ఈ సీజన్లలో 8 జట్లు పాల్గొన్నాయి. ఈసారి కొత్తగా రెండు జట్లు అదనంగా చేరాయి. ప్రతి జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. 15వ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. కొన్ని మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది.
ప్రస్తుతానికి పాయింట్ల వారీగా చూస్తే గుజరాత్ టాప్ లో ఉంది. ఆ జట్టు 13 మ్యాచ్ లు ఆడి 10 గెలిచింది. 20 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరింది.
రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals) 13 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ లలో విజయం సాధించి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ 13 మ్యాచ్ లు ఆడింది. 8 మ్యాచ్ లలో గెలుపొంది 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 16 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ రాజస్థాన్ కంటే రన్ రేట్ లో తక్కువగా ఉంది.
దీంతో ఆ జట్టు మూడో ప్లేస్ లో కొనసాగుతోంది. దీన్ని బట్టి చూస్తే రాయల్స్(Rajasthan Royals) జట్టు ప్లే ఆఫ్స్ కు తన బెర్త్ ఖరారు చేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ లలో గెలుపొంది 6 మ్యాచ్ లలో ఓడి పోయింది.
14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ లు ఆడింది . 6 గెలిచి 6 ఓడి పోయింది. 12 పాయింట్లతో 5వ ప్లేస్ లో ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ 13 మ్యాచ్ లు ఆడింది. 6 మ్యాచ్ లలో గెలిచి 7 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
12 పాయింట్లు సాధించింది. ఆరో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచి 6 ఓడి పోయింది.
12 పాయింట్లు సాధించింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ లు ఆడి 5 గెలిచి 7 మ్యాచ్ లలో ఓడి పోయి 10 పాయింట్లు సాధించింది. ఎనిమిదో స్థానంలో నిలిచింది.
Also Read : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ