Sanju Samson Welcome : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వీడియో అదుర్స్

వాట్ ఏ క్రియేటివిటీ అంటున్న నెటిజ‌న్లు

Sanju Samson Welcome : టెక్నాల‌జీ మారింది. ప్ర‌త్యేకించి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం ప్ర‌త్యేకంగా త‌మ ఆట‌గాళ్ల ప‌ట్ల చూపించే ప్రేమ గొప్ప‌ది. ఐపీఎల్ మెగా లీగ్ లో మిగ‌తా ఫ్రాంచైజీల కంటే ఆర్ఆర్ టీం వెరీ డిఫ‌రెంట్.

గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో త‌మ జ‌ట్టుకు కెప్టెన్ గా స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ ను (Sanju Samson Welcome)ఎంపిక చేసింది. ఈసారి కూడా అత‌డినే రిటైన్ చేసుకుంది సంజూ సీఎస్కేకు వెళ్లి పోతాడ‌ని టాక్ వ‌చ్చింది.

కానీ అలాంటి వాటికి చెక్ పెడుతూ సంజూను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ న‌మ్మ‌కం ఉంచింది. ఈసారి మెగా వేలంలో స్టార్ ప్లేయ‌ర్ల‌ను తీసుకుంది. ప‌నిలో ప‌నిగా సంగ‌క్క‌ర ఉన్నాడు క‌దూ.

తాజాగా కొత్త ఆట‌గాళ్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు షారుఖ్ ఖాన్ న‌టించిన ఓం శాంతి పాట‌కు మీమ్స్ త‌యారు చేసి ఓ వీడియోను వ‌దిలింది. ఇప్పుడు అది నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

జ‌ట్టు ఆట‌గాళ్ల‌తో పాటు చివ‌ర‌కు మెంటార్ గా ఉన్న కుమాగ‌ర సంగ‌క్క‌ర‌కు స్వాగ‌తం చెప్పేలా వీడియో ను త‌యారు చేశారు. వాళ్ల క్రియేటివిటీ సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు తెగ కితాబు ఇచ్చేస్తున్నారు.

ఇక ఇందులో షారుఖ్ ఖాన్ ఫేస్ మార్ఫింగ్ చేసి సంజూ శాంస‌న్ ను చేర్చింది. మిగ‌తా ఆట‌గాళ్ల‌ను కూడా ఆడేలా చూసింది.

త‌మ జ‌ట్టులోకి కొత్త‌గా వ‌చ్చిన చ‌హ‌ల్ , జిమ్మీ నీష‌మ్ , హెట్మెయ‌ర్ , అశ్విన్ , బౌల్ట్ కు స్వాగ‌తం ప‌లికింది. ఇదిలా ఉండ‌గా జ‌ట్టు ప‌రంగా చూస్తే సంజూ శాంస‌న్ స్కిప‌ర్ ,

జైస్వాల్, బ‌ట్ల‌ర్, అశ్విన్ , బౌల్ట్ , ప‌డిక్క‌ల్ , హెట్మెయిర్ , ప్రసిద్ద కృష్ణ‌, చ‌హ‌ల్ , రియాన్ ప‌రాగ్ , క‌రియ‌ప్ప‌, సైని, న‌వ‌దీప్ , కుల్దీప్ సేన్ ,క‌రుణ్ నాయ‌ర్, జురెల్ , బ‌రోకా, కుల్దీప్ , గ‌ర్వాల్ , నీష‌మ్ , రాస్సీ, మిచెల్ ఉన్నారు.

Also Read : పంత్ కు వైస్ కెప్టెన్సీ ప‌గ్గాలు

Leave A Reply

Your Email Id will not be published!