RR vs KKR IPL 2022 : స‌మ ఉజ్జీల యుద్దం కానుందా స‌మ‌రం

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్

RR vs KKR  : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 మెగా రిచ్ 15వ సీజ‌న్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక టైటిళ్లు గెలుచుకున్న జ‌ట్లు ఈ ఐపీఎల్ లో అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశకు గురి చేస్తున్నాయి.

ముంబై ఆరు మ్యాచ్ ల‌లో ఓడి పోగా చెన్నై ఒక‌టి గెలిచి ఆరింట్లో సేమ్ సీన్ తో విస్తు పోయేలా చేసింది. ఇక అన్నీ ఉండీ చేజేతులారా ఓట‌మి పాల‌వుతోంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

ప్ర‌ధానంగా కెప్టెన్ సంజూ శాంస‌న్ ఫామ్ లో లేక పోవ‌డం ఆ జ‌ట్టుకు శాపంగా మారింది.

ఇక‌నైనా త‌న డౌన్ ను మార్చుకుని ఫోక‌స్ పెడితే బెట‌ర్ లేక పోతే ఓట‌మి ఖాయం.

ముంబై లోని సీసీఐ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (RR vs KKR )మ‌ధ్య కీల‌క పోరుకు సిద్దం కానుంది. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్,

జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్,

రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

Also Read : డైన‌మెట్ ధోనీతో బంధం ప్ర‌త్యేకం

Leave A Reply

Your Email Id will not be published!