Rajeev Matta : పతనం అంచున భారత దేశం
మోదీ సర్కార్ పై రాజీవ్ మట్ట
Rajeev Matta : స్టాండప్ ఇండియా అంటే ఏమిటో అనుకున్నాం. మన్ కీ బాత్ చెబితే విన్నాం. కానీ దేశ సంపద అంతా కొందరి చేతుల్లోకి,
బడా వ్యాపారుల జేబుల్లోకి వెళుతోంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. పక్కనే ఉన్న శ్రీలంకను చూసైనా మోదీ ప్రభుత్వం నేర్చుకోవాలి.
లేక పోతే ప్రమాదం పొంచి ఉందంటూ తీవ్రంగా హెచ్చరించారు ప్రముఖ వ్యాపార వేత్త, ఎస్కే రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ సీఇఓ రాజవ్ మట్ట . మోదీ ఎనిమిదేళ్ల కాలంలో చేసింది ఒక్కటే 100 లక్షల కోట్లు అప్పు.
ఒక రకంగా ఈ దేశంలో మోదీ సర్కార్ లేదని అనుకోవాలి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ తీవ్ర(Rajeev Matta) ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
దీనిని రాష్ట్ర ఆర్థిక మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి వాల్యూ మరింత కనిష్టానికి చేరుకోవడం దేశం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉండడమేనని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పతనావస్థలోకి నెట్టి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రాను రాను దివాళా తీయక తప్పదని హెచ్చరించారు.
2014 నాటికి రూ. 53 లక్షల కోట్లు అప్పుగా ఉంటే దానిని మరో రూ. 100 లక్షల కోట్లకు చేర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు
రాజీవ్ మట్ట. ప్రస్తుతం దేశం మొత్తం అప్పు రూ. 153 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు.
దిగుమతులు ఇలాగే పెరిగితే రుణ భారం మరింత పెరుగుతుందని కుండ బద్దలు కొట్టారు. మోదీ ప్రభుత్వం వచ్చాక మొండి బకాయిదారులకు వెసులుబాటు కల్పించిందని మండిపడ్డారు.
దేశీయ బ్యాంకులు 2021 ఆర్థిక సంవత్సరంలో బడా వ్యాపారవేత్తలకు చెందిన రూ. 2.02 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి దానికి మోదీ కరోనా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కారణం అంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ సెటైర్ వేశారు రాజీవ్ మట్ట(Rajeev Matta).
Also Read : ఇండియాలో 11.6 లక్షల జాబ్స్ : అమెజాన్