Rajeev Shukla : రాజీనామా చేయనున్న రాజీవ్ శుక్లా..?
బీసీసీఐలో జోడు పదవులు ఉండకూడదు
Rajeev Shukla : రాజీవ్ శుక్లా ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. భారత దేశంలో క్రీడా రంగాన్ని శాసిస్తున్న ఏకైక ఆట క్రికెట్. ఓ వైపు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) కు ప్రాణ ప్రతిష్ట చేసింది లలిత్ మోదీ అయితే భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లో గత కొన్నేళ్ల నుంచి కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు రాజీవ్ శుక్లా(Rajeev Shukla).
ప్రస్తుతం బీసీసీఐకి ఇద్దరు బాస్ లు ఉన్నారు. ఒకరు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అయితే మరొకరు కార్యదర్శి జై షా. ప్రతిపక్షాలు మాత్రం జోడు పదవులు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.
ఎందుకంటే జై షా కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు. ఇక గంగూలీ, జై షా పదవీ కాలం ముగియనుంది. మరి వీరి పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక వారే తప్పుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఇందుకు సంబంధించిన కేసును జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా రాజీవ్ శుక్లా(Rajeev Shukla) కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. మోస్ట్ పాపులర్ కూడా. మనోడికి ఈ ఏడాది జాక్ పాట్ తగిలింది.
అదేమిటంటే ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ప్రజా సేవలో ఉన్న వ్యక్తి బీసీసీఐలో ఎలాంటి పదవి చేపట్ట కూడదని క్లాజు ఉంది.
దీని ప్రకారం రాజీవ్ శుక్లా ముందున్నది ఒకటి ఎంపీ గా ఉండడమా లేక కోట్ల ఆదాయం కలిగి ఉన్న బీసీసీఐలో ఉంటూ చక్రం తిప్పడమా అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా రాజీవ్ శుక్లా ఎట్టకేలకు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆయన ప్రకటించాల్సి ఉంది.
Also Read : కోహ్లీ నాక్కొంచెం టైం ఇవ్వు – గవాస్కర్