Rajnath Singh : కమలం గెలుపు ఖాయం
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh : మల్కాజిగిరి – తెలంగాణలో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు.
Rajnath Singh Comment
తాము తెలంగాణ రాష్ట్రంతో పాటు మణిపూర్, ఛత్తీస్ గఢ్ , మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో సైతం విజయం సాధించ బోతున్నామని ఇక దేశమంతటా కమలం జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. దేశాన్ని ఇనేళ్ల పాటు పాలించిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతులు వల్లిస్తోందన్నారు. ఆ పార్టీకి చెందిన వారంతా అవినీతిలో కూరుకు పోయారని, తాము వచ్చాక వారి భరతం పడుతున్నామని స్పష్టం చేశారు.
కర్ణాటకలో మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చారని సేమ్ సీన్ తెలంగాణలో రిపీట్ చేయబోతున్నారంటూ ఇది వర్కవుట్ కాదన్నారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh). రాష్ట్రంలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఇక్కడ అవినీతి ఆకాశాన్ని తాకుతోందన్నారు.
తమకు అధికారం అప్పగించినట్లయితే తొలి రోజునే కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు వెళ్లేలా చేస్తామని, విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : Bandi Sanjay : కేటీఆర్ కామెంట్స్ బండి సీరియస్