Rajya Sabha Passes : ఈసీ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఆమోదం

ప్ర‌వేశ పెట్టిన మోదీ బీజేపీ ప్ర‌భుత్వం

Rajya Sabha : న్యూఢిల్లీ – అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క బిల్లును మోదీ ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టింది. ఇందుకు సంబంధించి కీల‌క స‌వ‌ర‌ణ‌లు చేప‌ట్టింది. గ‌త కొంత కాలం నుంచి చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ తో పాటు క‌మిష‌న‌ర్ల నియామ‌కం వివాదాస్ప‌దంగా మారింది. దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్.

Rajya Sabha Approves EC Bill

మార్పులు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు కేంద్ర ప్ర‌భుత్వానికి. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో మార్పులు చేసింది ప్ర‌భుత్వం. రాజ్యసభ(Rajya Sabha) ఆమోదించిన బిల్లు, ప్రతిపక్షాల వాదనతో ఎదురు దెబ్బ తగిలింది.

ప్రధాన ఎన్నికల కమిష‌న‌ర్, క‌మిష‌న‌ర్ల కోసం ఉన్నత స్థాయి ఎంపిక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష పార్టీల గందరగోళం మధ్య పార్లమెంటు ఎగువసభలో బిల్లు ఆమోదం పొందింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారించింది. దేశంలోని కీలక ఎన్నికల అధికారుల నియామకం కోసం ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read : CM Revanth Reddy : హైద‌రాబాద్ అభివృద్దిపై రేవంత్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!