Rakesh Jhunjhunwala : రూ. 5 వేలతో రూ. 40 వేల కోట్లు
రాకేశ్ రియల్ ఇండియన్ వారెన్ బఫెట్
Rakesh Jhunjhunwala : ఏమిటీ కేవలం రూ. 5 వేలతో రూ. 40 వేల కోట్లకు పైగా ఎలా సంపాదించాలో తెలిస్తే విస్తు పోతాం. కానీ చేసి చూపించాడు రాకేష్ ఝున్ ఝున్ వాలా. 62 ఏళ్లకు గుండె పోటుతో ఇవాళ మరణించాడు.
తండ్రి నేర్చుకున్న పాఠం అతడిని స్టాక్ మార్కెట్ వైపు చూసేలా చేసింది. ఒకే వేళ తాను అడిగిన డబ్బులు గనుక ఇచ్చి ఉంటే ఝున్ ఝున్ వాలా(Rakesh Jhunjhunwala) ఓ సాధారణ మానవుడిగానే ఉండి పోయాడు.
స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది జడుసుకుంటారు. అదో జూదం. కానీ ముందు చూపు కలిగిన వ్యక్తి కాబట్టే ఝున్ ఝున్ వాలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయాడు.
తాను చిన్నగా ప్రారంభించిన ఆ డబ్బులే రూ. 40,000 వేల కోట్ల ఆస్తులను పోగేసేలా చేశాయి. ఇది అక్షరాల నిజం. రాకేష్ ప్రతి దానిలోనూ ఇన్వెస్ట్ చేశాడని అనుకుంటే పొరపాటు పడినట్టే.
ఏది భవిష్యత్తులో పెరుగుతోందో, వేటికి ఎక్కువ డిమాండ్ ఉందో రీసెర్చ్ చేశాడు. తానే ఇండియన్ వారెన్ బఫెట్ గా మారి పోయాడు.
ఇవాళ భారత దేశానికి చెందిన దిగ్గజాలే కాదు వివధ రంగాలకు చెందిన ప్రముఖులు రాకేష్ ఝున్ ఝున్ ఝున్ వాలా లేడంటే నమ్మలేక పోతున్నారు.
చివరకు ఆయన పౌర విమానయాన రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. జూలై 5, 1960లో హైదరాబాద్ లో పుట్టాడు. ముంబైలో పెరిగారు. సీడెన్ హామ్ లో డిగ్రీ చేశాడు.
ఆ తర్వాత సీఏ చదివాడు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ గా ఉన్న రేఖాను పెళ్లి చేసుకున్నాడు. ఝున్ ఝున్ ఝున్ వాలా(Rakesh Jhunjhunwala) బుల్లిష్ గా పేరొందాడు. ఆయన కొనుగోలు చేసిన స్టాక్ లు ఎక్కువగా మల్టీ బ్యాగర్ గా మారాయి.
రేర్ ఎంటర్ ప్రైజెస్ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని స్టాక్ ట్రేడింగ్ సంస్థను నడుపుతున్నాడు. ఇటీవలే ఎయిర్ లైన్ అకాసా ఎయిర్ కు మద్దతు ఇచ్చాడు.
వైఫల్యాలు కూడా పాఠాలు నేర్పుతాయి. వాటిని నేను సానుకూలంగా తీసుకుంటానని రాకేష్ ఝున్ ఝున్ వాలా చెబుతూ వచ్చారు. ఆర్థికంగా ఎదగాలని అనుకునే వాళ్లు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
Also Read : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం బాధాకరం