Rakhi Sawant Husband : రాఖీ సావంత్ భర్త ఆదిల్ అరెస్ట్
దాడి చేసి డబ్బులు..నగలు ఎత్తుకెళ్లాడు
Rakhi Sawant Husband : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఫిర్యాదు మేరకు తన స్వంత భర్త ఆదిల్ దురానీని(Rakhi Sawant Husband) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిల్ తనపై దాడి చేశాడని, అంతే కాకుండా తనకు తెలియకుడా తన ఫ్లాట్ లోని డబ్బులు, నగలను ఎత్తుకెళ్లాడంటూ ఆరోపించారు. నటి రాఖీ సావంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిల్ దురానీని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది 2022లో ఆదిల్ దురానీని పెళ్లి చేసుకున్నట్లు ఇటీవలే వెల్లడించారు రాఖీ సావంత్ .
ఆదిల్ దురానీపై ఓషివారా పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయంత్రం తర్వాత ఎఫ్ఐఆర్ లో ఐపీసీ 498 (ఎ) , 377 సెక్షన్లను కూడా కొత్తగా జోడించారు. ఇవాళ ఆదిల్ దురానీని(Rakhi Sawant Husband) కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు పోలీసులు. తన వద్ద ఉన్న డబ్బులు, నగల కోసం తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది నటి రాఖీ సావంత్.
ఈ సందర్భంగా నటి ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదిల్ దురానీ కొట్టాడు. తాను వెంటనే పోలీసులకు కాల్ చేశానని చెప్పారు. తరచూ ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నాడంటూ వాపోయింది. ఇవాళ కూడా కొట్టేందుకు వచ్చాడని వాపోయింది. అతడి కారణంగా తన పరువు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది రాఖీ సావంత్.
ఇదిలా ఉండగా ఇన్ స్టాగ్రామ్ లో మే 29, 2022న తామిద్దరం వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి వివాహ ధృవీకరణ పత్రం కూడా జత చేసింది.
Also Read : స్టార్ ను కాను సామాన్యుడిని – సేతుపతి