Ram Charan KTR Anand Mahindra : మహీంద్రా..కేటీఆర్ కు చెర్రీ థ్యాంక్స్
ఫార్ములా రేస్ వన్ పై కామెంట్
Ram Charan KTR Anand Mahindra : మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ తో ప్రముఖ నటుడు రామ్ చరణ్ అలియాస్ చెర్రీ థ్యాంక్స్ తెలిపాడు. ఆయన ఈ ఇద్దరినీ ప్రత్యేకంగా కలిశారు. కొంత సేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్ లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ కారు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ , నటుడు రామ్ చరణ్ ప్రత్యేకంగా(Ram Charan KTR Anand Mahindra) పాల్గొన్నారు. సీఎండీ సీపీ గుర్నానితో సమావేశం జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు చెర్రీ.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లక్షలాది మందిని తన ట్వీట్లతో ప్రభావితం చేస్తూ వస్తున్న ఆనంద్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అభినందనలు. అంతే కాకుండా ముందు చూపుతో ఐటీతో పాటు ఇతర రంగాలపై మంచి పట్టున్న ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ను కూడా ప్రత్యేకంగా ప్రశంసలతో కురిపించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను తీసుకు వస్తున్నందుకు థ్యాంక్స్ తెలిపారు నటుడు రామ్ చరణ్.
దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఫార్ములా రేస్ కు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిద్దమైంది. హుస్సేన్ సాగర్ తీరంలో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పేరుతో ఏర్పాటు చేసింది. ఈ రేసులో మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ రేసులో 11 జట్లు పాల్గొంటున్నాయి. 22 వేల మందికి పైగా కార్ రేస్ ను వీక్షించేందుకు అవకాశం ఉంది.
Also Read : ఏప్రిల్ 14న రానున్న శాకుంతలం
