Ram Charan Watch : చెర్రీ వాచ్ ధర చాలా కాస్ట్ లీ గురూ
వరల్డ్ లో టాప్ రిచర్డ్ మిల్లే వాచ్
Ram Charan Watch : ప్రముఖ నటుడు రామ్ చరణ్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఇటీవలే పండంటి బిడ్డకు తండ్రి అయ్యారు. అపోలో ఆస్పత్రిలో భార్య కొణిదెల ఉపాసన నుంచి డిశ్చార్జి అయ్యారు. చెర్రీ, ఉప్సీ ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించి మీడియా కూడా భారీ ఎత్తున కవరేజ్ ఇచ్చింది. తమ మెగా ఫ్యామిలీలో పాప పుట్టడం అంటే అదృష్టం తలుపు తట్టినట్టేనని పేర్కొన్నారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. పెద్ద ఎత్తున గ్రీటింగ్స్ తెలిపారు రామ్ చరణ్ కు, ఉపాసనకు.
ఇదిలా ఉండగా ఇటీవల దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాడు రామ్ చరణ్(Ram Charan). ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతే కాదు నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. దీనిని తెలంగాణకు చెందిన చంద్రబోస్ రాస్తే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
తాజాగా వైరల్ గా మారారు రామ్ చరణ్. కారణం ఏమిటంటే ఆయన తన చేతికి వాడే వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వాచ్ వరల్డ్ లో మోస్ట్ ఫేమస్ వాచ్ ల తయారీ కంపెనీ రిచర్డ్ మిల్లేది. దీని ఖరీదు ఏకంగా కోటి 62 లక్షల కోట్లు. ఈ విషయం తెలుసుకున్న వారంతా విస్తు పోయారు. ఇక అభిమానులు మాత్రం తమ హీరో రేంజ్ కు ఈ వాచ్ ధర తక్కువే అంటున్నారు.
Also Read : Anand Mahindra : తొలకరి వర్షం మహీంద్రా ఆనందం