Ram Gopal Varma : బండారు కామెంట్స్ ఆర్జీవీ సీరియస్
మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్న
Ram Gopal Varma : హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె బ్లూ ఫిల్ములలో నటించిందని , అవి తమ వద్ద ఉన్నాయని అన్నారు.
నీ బండారం బయట పెడతానంటూ హెచ్చరించారు. ఆనాడు మిర్యాలగూడ ఎన్నికల్లో ఎవరితో పడుకున్నావో తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ హెచ్చరించారు. ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు.
Ram Gopal Varma Serious Comments on Bandaru Satyanarayana
దీనిపై సీరియస్ గా స్పందించారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఇంత బరితెగించి కామెంట్స్ చేసిన బండారు సత్య నారాయణ చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఎందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించడం లేదని ప్రశ్నించారు.
పబ్లిక్ గా ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు రామ్ గోపాల్ వర్మ. స్త్రీలను అవమానించడం ఇంకేం ఉంటుందని పేర్కొన్నారు. బండారుపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు దర్శకుడు.
Also Read : Pendyala Srinivas : బాబుకు షాక్ పెండ్యాలపై వేటు