Tirumala Laddu : తిరుమల లడ్డూ తయారీ కల్తీ పై స్పందించిన రమణ దీక్షితులు
ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చెయ్యడం హర్షణీయం...
Tirumala : శ్రీవారి లడ్డూలో కొవ్వు నిజమేనని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారణ కావడం ప్రకంపనలు రేపుతోంది. భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రగడ రాజేస్తున్న ఈ వ్యవహారంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యార పేర్కొన్నారు. ‘‘ అన్నం పెట్టే దేవుడికి రుచిగా, సుచిగా నివేదనలు పెట్టాలి. నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరం. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదు. ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అని బాధ కలుగుతోంది. గతంలో చాలా సార్లు టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లాను. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు తిరుమల(Tirumala)లో మహాపాపం జరిగింది. నెయ్యిలో కొవ్వు పదార్ధాలు కలవడం వల్ల అపచారం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది’’ అని రమణ దీక్షితులు అన్నారు.
Tirumala Laddu…
‘‘ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చెయ్యడం హర్షణీయం. ఆగమంపైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలి. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో నన్ను హింసలు పెట్టారు. నాపైన పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. పోటులో సంప్రోక్షణ చేసి లడ్డూ తయారీని పునః ప్రారంభించాలి. ప్రస్తుత ఆగమ కమిటీని ఉద్యోగులతో భర్తీ చేశారు. వాళ్లు ఎలాంటి నిర్ణయాలు అమలు చేయలేరు. ఆగమ సలహాదారులుగా ఇతర రాష్ట్రాల వారిని నియమించాలి. నన్ను ఆలయానికి దూరంగా పెట్టారు’’ అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.
Also Read : TG Cabinet : తెలంగాణ క్యాబినెట్ లో ‘హైడ్రా’ పై కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్