Modi : వెయ్యేళ్ల కిందట ఈ భూమిపై జన్మించిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు. ఆయన కుల, మతాలకు వ్యతిరేకంగా గళం ఎత్తాడు. దైవం పండితులకే కాదు పామరులకు కూడా అవసరమని నినదించాడు.
దక్షిణాదిన పుట్టి దేశ మంతటా వ్యాపించాడు. అలాగే ఈ దేశంలో మరో మహానుభావుడు వెలిశాడు ఆయనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. వీరిద్దరూ వేర్వేరు మార్గాలకు చెందిన వారు.
వేర్వేరు కాలాలలో ఇక్కడ నడయాడిన వారు. కానీ వారు అనుసరించిన మార్గం మాత్రం ఒక్కటే. అది ఏమిటంటే సర్వ మానవులు, సకల జీవరాశులు అంతా ఒక్కటేనని నమ్మారు.
వారు భౌతికంగా లేక పోయినా తరాలు మారినా కాలం శరవేగంగా పరుగులు తీసినా, టెక్నాలజీ విస్తరించినా ఇంకా వారిద్దరినీ మనందరం నేటికీ స్మరించు కుంటున్నామని గుర్తు చేశారు.
వారిద్దరూ పామరులు, దళితులు, పీడితులు, అన్నార్తులు, పేదలు బాగుండాలని తలంచారు. ఒకరు దైవానికే సవాల్ విసిరితే ఇంకొకరు సామాజిక అంతరాలపై యుద్దం చేశారన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ(Modi).
రామానుజం, అంబేద్కరిజం ఒక్కటే..ఆ రెండూ కలిసిందే నేటి భారత రాజ్యాంగం అంటూ ప్రధాని కొత్త భాష్యం చెప్పారు. మూఢ విశ్వాసాలను పారదోలేందుకు ప్రయత్నించారు రామానుజుడు.
కులం, జాతి లేదన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన మహానుభావుడు అన్నారు. ఇక అంబేద్కర్ ఎన్నో ఇబ్బందులకు లోనై చివరకు తాను అనుకున్నది సాధించాడు.
ఈ దేశంలో 80 శాతానికి పైగా ఉన్న సంబండ వర్ణాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు మోదీ.
Also Read : దేశం చూపు సమతా మూర్తి వైపు