Ramiz Raja Anounces : అంధులు..బ‌ధిరుల జ‌ట్ల‌కు భారీ న‌జ‌రానా

ప్ర‌క‌టించిన పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా

Ramiz Raja Anounces : పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా(Ramiz Raja Anounces) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ దేశం త‌ర‌పున ఆడుతూ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న అంధులు, బ‌ధిరుల జ‌ట్ల‌కు తీపి క‌బురు చెప్పారు.

ఆయా జ‌ట్లకు భారీ నజ‌రానా ప్ర‌క‌టించారు. భారీ ప్రైజ్ మ‌నీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. పీసీబీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఈనెల 20న నేష‌న‌ల్ హై పెర్ఫార్మెన్స్ సెంట‌ర్ లో జ‌రిగింది.

పీసీబీ రాజ్యాంగం 2019లోని క్లాజ్ 20 ప్ర‌కారం ఆడిట్ చేసిన ఖాతాలు, పీసీబీ వార్షిక నివేద‌క‌ను స‌ర్వ స‌భ్య స‌మావేశం ఆమోదించింది. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ రాజా వెల్ల‌డించారు. క్రికెట్ ను దేశంలోని గ్రామీణ ప్రాంతాల‌లో మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

2023 ప్ర‌పంచ క‌ప్ కు అర్హ‌త సాధించిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ సూప‌ర్ లీగ్ లో పాక్ టాప్ లో ఉంద‌ని తెలిపారు. టెస్టుల్లో ఐదో ర్యాంక్ , వ‌న్డే, టి20 ల‌లో మూడో ర్యాంలో కొన‌సాగుతోంద‌న్నారు.

ఇందులో భాగంగా ఈ ఏడాదితో పాటు వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ జ‌ట్టు ప‌ర్య‌టించే షెడ్యూల్ ను కూడా ఆమోదం తెలిపామ‌న్నారు.

రెండు టెస్టుల కోసం శ్రీ‌లంక లో, ఏసీసీ టి20 ఆసియా క‌ప్ , మూడు వ‌న్డేల కోసం నెద‌ర్లాండ్స్ , ఐసీసీ పురుషుల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఆసిస్ టూర్ కు ఆమోదం తెలిపామ‌న్నారు.

స్వ‌దేశీ సీరీస్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జ‌ట్ల‌తో పాకిస్తాన్ ఆడ‌నుంది. మ‌హిళ‌ల జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగే బ‌ర్మింగ్ హోమ్ కామ‌న్వెల్త్ గేమ్స్ , టి20 ప్ర‌పంచ క‌ప్ ల‌లో పాల్గొంటుంద‌న్నారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను అంధులు, బ‌ధిరుల క్రికెట్ జ‌ట్ల‌కు ఒక్కొక్క‌రికి ఒన్ మిలియ‌న్ రివార్డులు ప్ర‌క‌టించారు.

Also Read : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్ల ఎంపిక‌కు డెడ్ లైన్

Leave A Reply

Your Email Id will not be published!