Ramiz Raja : పాకిస్తాన్ లో కొత్తగా ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. అవిశ్వాస తీర్మానం లో 2 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు మాజీ ప్రధాని, మాజీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Ramiz Raja).
ఈ తరుణంలో తనతో కలిసి ఆడిన, తనకు అత్యంత ఆప్తుడైన రమీజ్ రజాను ఏరికోరి పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు సిఇఓ కమ్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.
దీంతో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రమీజ్ రజా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ లాగే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కూడా అయిన రమీజ్ రజా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ మీటింగ్ లో పీసీబీ తరపున హాజరయ్యారు. బీసీసీఐ లాగే పీసీబీని ప్రక్షాళన చేయాలని భావించాడు రమీజ్ రజా. కొన్ని మార్పులు సైతం చేశాడు.
రమీజ్ రజా (Ramiz Raja) అంటే చాలా మందికి మంచి అభిప్రాయం కూడా ఉంది. ఎక్కడా కాంట్రోవర్సీస్ కు వెళ్లడు. మంచి కామెంటేటర్ గా పేరొందాడు. ఇమ్రాన్ ఖాన్ పట్టుపట్టి కోరడంతో కాదనలేక పీసీసీ చీఫ్ పదవి స్వీకరించాడు.
తీరా తనను నియమించిన తన స్నేహితుడు పీఎంగా లేక పోవడంతో ఇక ఉండీ ఏం లాభం అంటూ తప్పుకునేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రమీజ్ రజా వ్యాఖ్యతగా, టీవీలో అనలిస్ట్ గా , నిపుణుడిగా కెరీర్ లో బాగా సెటిల్ అయ్యాడు. పలు అసైన్ మెంట్లతో బిజీగా ఉన్నాడు. ఇమ్రాన్ కోరడంతో పట్టుపట్టి బోర్డు కు చీఫ్ గా ఉండేందుకు ఓకే చెప్పాడు.
Also Read : కుల్దీప్ సేన్..చహల్ ఆట అద్భుతం