Ramiz Raja Jay Shah : జే షా నిర్ణయం పీసీబీ ఆగ్రహం
ఏడాదికి ముందే ఎందుకీ ప్రకటన
Ramiz Raja Jay Shah : ఎప్పుడైతే గంగూలీ నిష్క్రమించాడో ఇక బీసీసీఐకి బాస్ గా బిన్నీ ఉన్నా మొత్తం చక్రం తిప్పేది మాత్రం జే షానేనని చెప్పక తప్పదు. అక్టోబర్ 18న యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసింది. ఎందుకంటే వరల్డ్ లో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థలలో ఒకటిగా పేరుంది బీసీసీఐకి.
పూర్తి స్థాయి కార్యవర్గం ఎన్నికైంది. తిరిగి మరోసారి బీసీసీఐకి కార్యదర్శిగా ఎన్నికయ్యారు కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జే షా( Jay Shah). ఇది పక్కన పెడితే సమావేశం ముగిసిన వెంటనే జే షా కీలక ప్రకటన చేశాడు. అదేమిటంటే వచ్చే ఏడాది 2023లో పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ లో భారత జట్టు పాల్గొనదని పేర్కొన్నాడు.
ఆపై తటస్థ వేదికలైతే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. ఇది ఇంకా ఏడాది కాలం ఉందని ఇప్పుడే ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని నిప్పులు చెరిగింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). చైర్మన్ రమీజ్ రజాతో(Ramiz Raja) పాటు ఇతర ఉన్నతాధికారులు బిగ్ షాక్ కు గురయ్యారు.
ఇది పూర్తిగా క్రికెట్ నియమాలకు విరుద్దమని మండి పడ్డాడు రమీజ్ రజా. కాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నాడు జే షా. ఆ స్థాయిలో ఈ ప్రకటన చేయడం కలకలం రేపింది. ఇది పూర్తిగా మంచి పద్దతి కాదని పేర్కొన్నాడు రమీజ్ రజా.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతియుత , ప్రశాంత వాతావరణం నెలకొంటున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పీసీబీ చైర్మన్.
Also Read : ఆసియా కప్ కోసం పాక్ కు భారత్ వెళ్లదు