Ramiz Raja Warning : మాతో ఆడక పోతే వరల్డ్ కప్ కు దూరం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా
Ramiz Raja Warning : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు భారత జట్టుపై , బీసీసీఐ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జే షా టీమిండియా పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ లో పాల్గొన బోదని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు రమీజ్ రజా.
ఇదే సమయంలో పాకిస్తాన్ లో శాంతి భద్రతల సమస్య ఉందని, ప్రత్యేకించి దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నందున తమ జట్టును పాకిస్తాన్ కు పంపించే ప్రసక్తి లేదన్నారు కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. శనివారం మీడియాతో మాట్లాడారు పీసీబీ చైర్మన్ రమీజ్ రజా.
ఒకవేళ పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆసియా కప్ లో భారత జట్టు పాల్గొనక పోతే తాము ఇండియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో చేపట్టే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ఆడ బోదంటూ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే ఐసీసీకి కూడా సమాచారం ఇచ్చామని చెప్పారు రమీజ్ రజా(Ramiz Raja Warning). ఇదిలా ఉండగా వచ్చే ఏడాదిలో రెండు ప్రముఖ టోర్నీలు జరగనున్నాయి. ఒకటి ఆసియా కప్. రెండోది ఐసీసీ వన్డే వరల్డ్ కప్. ఐసీసీ మెగా టోర్నీ కంటే ముందే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది.
అయితే ఈసారి శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ ను ఆర్థిక, భద్రత కారణాల రీత్యా దుబాయ్ లో చేపట్టారు. మొత్తంగా రమీజ్ రజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
Also Read : బౌలర్ల నిర్వాకం భారత్ కు శాపం