Ramiz Raja : ఐపీఎల్ పై ర‌మీజ్ ర‌జా కామెంట్స్

ఎవ‌రు వెళ‌తారో చూడాలి

Ramiz Raja : ప్ర‌పంచ వ్యాప్తంగా బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ అత్యంత ప్రజాద‌ర‌ణ పొందింది. ఆట ప‌రంగానే కాదు ఆదాయం ప‌రంగా టాప్ లో ఉంది ఈ రిచ్ లీగ్.

ఈ త‌రుణంలో ఐపీఎల్ కు పోటీగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో పీసీఎల్ నిర్వ‌హిస్తోంది. కానీ భార‌త్ లో ఉన్నంత ఆద‌ర‌ణ దాని వైపు ఉండ‌డం లేదు.

ఇప్పుడిప్పుడే పీసీబి ఆదాయ బాట‌లో ప‌డుతోంద‌ని ఇంకా మెరుగైన మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిఇఓ, చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా(Ramiz Raja).

ఐపీఎల్ లాగానే పీసీఎల్ ను కూడా ఆదాయ బాట‌లో ప‌ట్టించే యోచ‌న చేస్తున్నామ‌న్నారు. క‌రాచీ లోని నేష‌న‌ల్ స్టేడియంలో ర‌మీజ్ ర‌జా మీడియాతో మాట్లాడారు.

పీఎస్ఎల్ లో ఐపీఎల్ మాదిరిగానే వేలం విధానాన్ని ప్ర‌వేశ పెడితే మంచి ఫ‌లితాలు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్నారు. ఇందు వ‌ల్ల దేశ వ్యాప్తంగా క్రికెట్ ప‌రంగా కొత్త వారికి అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు.

పీసీఎల్ మ‌రింత పాపుల‌ర్ అయితే ఇత‌ర దేశాల నుంచి ఆట‌గాళ్లు ఇక్క‌డికి వ‌చ్చి పాల్గొనేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. ఆదాయాన్ని ఆర్జించ‌డంలో పీఎస్ఎల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌న్నారు.

దీని వ‌ల్ల దేశ ప్ర‌తిష్ట కూడా పెరుగుతుంద‌న్నారు. చాలా మంది క్రికెట‌ర్లు ఐపీఎల్ తో పాటు పీసీఎల్ లో కూడా పాల్గొంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ర‌మీజ్ ర‌జా(Ramiz Raja).

ఆర్థికంగా స్వ‌తంత్రంగా ఉండేందుకు కొత్త ఆస్తుల‌ను సృష్టించాల్సిన అవ‌స‌రంద ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఆదాయ మార్గాలు పీఎస్ఎల్ , ఐసీసీ నిధులు త‌ప్ప మ‌రేమీ లేవ‌న్నారు పీసీబీ చైర్మ‌న్.

Also Read : ఉక్రెయిన్ ప్ర‌భుత్వాన్ని కూల్చం

Leave A Reply

Your Email Id will not be published!