Rani Agarwal : సింగ్రౌలిలో బీజేపికి షాకిచ్చిన ఆప్
మధ్య ప్రదేశ్ లో ఆప్ హవా
Rani Agarwal : ఆమ్ ఆద్మీ పార్టీ మెల మెల్లగా చాప కింద నీరులా పుంజుకుంటోంది. ఆయా రాష్ట్రాలలో గణనీయమైన ఓటు బ్యాంకు సాధించేందుకు ప్లాన్ చేస్తోంది.
త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాగా వేసే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అడుగులు వేస్తోంది.
తాజాగా భారతీయ జనతా పార్టీ కొలువుతీరిన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆప్. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి విస్తు పోయేలా చేసింది పార్టీ. ఏకంగా సింగ్రౌల్ మేయర్ పీఠం దక్కించుకుని బోణీ కొట్టింది.
రాబోయే ఎన్నికల్లో గట్టి సవాల్ ఎదురు కానుందంటూ హెచ్చరిక చేసింది విజయంతో . బీజేపీకి తామే ప్రధాన ప్రత్యామ్నాయం అంటూ స్పష్టం చేసింది. తాజాగా ఎంపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటింది.
సింగ్రౌలీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాణి అగర్వాల్ ఏకంగా 9,000 వేల ఓట్ల తేడాతో ఓడించింది.
దీంతో ఈ పోటీలో బలమైన రెండు పార్టీలు రెండో, మూడో స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో రాణి అగర్వాల్(Rani Agarwal) మొదటగా జిల్లా పంచాయతీ మెంబర్ గా ఎన్నికయ్యారు.
తాజాగా సింగ్రౌలి నగర మేయర్ పీఠంపై కొలువు తీరనున్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన రాణా అగర్వాల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read : మణిపూర్ గవర్నర్ కు బెంగాల్ బాధ్యతలు