Ranil Wickramasinghe : శ్రీ‌లంక ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్

స్ప‌ష్టం చేసిన శ్రీ‌లంక చీఫ్ ర‌ణిలె విక్ర‌మ‌సింఘే

Ranil Wickramasinghe : శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు ర‌ణిలె విక్ర‌మ‌సింఘే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కేవ‌లం సాయం చేసి ఇబ్బందులు పెట్ట‌కుండా ఉండే దేశాల‌తోనే ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

సాయం పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకోమంటూ పేర్కొన్నారు. శ్రీ‌లంక రుణం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దానిలో ఎక్కువ భాగం చైనాకు బాకీ ఉంద‌ని తెలిపారు.

ఆచి తూచి అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. దురుదృష్టవ‌శాత్తు ద‌క్షిణ ఆసియా ప్రాంతంలో విదేశీ వాణిజ్య ఏకీక‌ర‌ణ ఉంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు ప్రెసిడెంట్ విక్ర‌మ‌సింఘే(Ranil Wickramasinghe).

ద్వీప దేశం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌ర్నిర్మించ‌డంపై జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌స్తుతం త‌మ ముందున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఆర్థిక‌, ఆహార సంక్షోభం. దాని నుంచి గ‌ట్టెక్కేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు.

ఈ విష‌యంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాల్సింది భార‌త దేశం గురించి అని పేర్కొన్నారు. ఓ వైపు భార‌త్ ను పొగుడుతూనే ఇంకో వైపు చైనాను దువ్వుతున్న‌ట్టుగా ఉంది ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.

భార‌త దేశం శ్రీ‌లంక‌ను చైనా నుండి దూరంగా ఉంచేందుకు చాలా కాలం పాటు ప్ర‌య‌త్నం చేసింది. దేశంలోని ఓడ రేవుకు చైనా గూఢ‌చారి ఓడ రావ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది శ్రీ‌లంక‌కు. దీంతో ఆ దేశం స్పందించింది. తాము చైనాకు ఓడ‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరామ‌ని స్ప‌ష్టం చేసింది.

సంక్షోభంలో ఉన్న దేశానికి 5 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన సాయం కాకుండా శ్రీ‌లంక‌తో భార‌త్ అనేక వాణిజ్య ఒప్పందాల‌ను క‌లిగి ఉంది.

Also Read : స‌హ‌నంతో ఉంటే స‌హించ‌డం కాదు

Leave A Reply

Your Email Id will not be published!