Ranil Wickremesinghe : అమ్మకానికి శ్రీలంక ఎయిర్ పోర్ట్ సిద్దం
జీతాలు చెల్లించేందుకు నానా అగచాట్లు
Ranil Wickremesinghe : శ్రీలంకలో ప్రధాన మంత్రి మారినా కొత్తగా రణిలె విక్రమసింఘె (Ranil Wickremesinghe) కొలువు తీరినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నిరసనలు, ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఆర్థిక పరిస్థితి భరించ లేనిదిగా తయారైంది. డీజిల్, పెట్రోల్, ఆహారం, నిత్యవసరాల ధరలలో ఎలాంటి మార్పు లేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడుతున్నారు విక్రమసింఘె.
ఈ సందర్భంగా ఆయన దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. శ్రీలంక ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోందంటూ వెల్లడించారు ప్రధాన మంత్రి.
జీతాలు చెల్లించేందుకు డబ్బును బలవంతంగా ముద్రించారని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే ప్రయత్నాలలో భాగంగా నష్టాలను నివారించేందుకు దాని జాతీయ విమానయాన సంస్థను విక్రయించేందుకు రెడీ అయ్యింది.
గత ఏడాది 2021 మార్చి ముగిసే లోపు క్యారియర్ 45 బిలియన్ రూపాయలను కోల్పోయింది. దేశం విదేశీ రుణాలపై అధికారికంగా డిఫాల్ట్ చేసేందుకు కొద్ది రోజుల ముందు ప్రధాని ఈ ప్రకటన చేశారు.
ఈ నష్టాన్ని విమానంలో అడుగు పెట్టని పేద వారు భరించాల్సిన అవసరం లేదన్నారు రణిలె విక్రమసింఘె(Ranil Wickremesinghe) . ఉద్యోగంలో చేరిన వారం లోపే జీతాలు చెల్లించేందుకు డబ్బుల్ని ముద్రించాల్సి వచ్చిందన్నారు.
ఇలాగే ముద్రిస్తూ పోతే దేశ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయమన్నారు ప్రధాన మంత్రి. రాబోయే రెండు నెలలు తమ దేశం మరింత ఇబ్బందులు ఎదుర్కోకక తప్పదన్నారు.
హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో గత వారం రణిల పీఎంగా కొలువుతీరారు. అంతర్జాతీయ ద్రవ్య నిధితో బెయిల్ అవుట్ చర్చలకు నాయకత్వం వహించేందుకు ఇంకా ఆర్థిక మంత్రిని నియమించలేదు.
పూర్తి స్థాయి ప్రభుత్వం లేక పోవడంతో నిధులు అందుతాయా లేదా అన్నది అనుమానంగా ఉంది.
Also Read : పాకిస్తాన్ ను ముంచిన అమెరికా