Ranveer & Rahman IPL 2022 : రెహమాన్ స్వరం వందేమాతరం
దద్దరిల్లిన మోదీ స్టేడియం
Ranveer & Rahman IPL 2022 : ప్రపంచ సంగీత దిగ్గజం అల్లా రఖా రెహమాన్(Rahman IPL 2022) మరోసారి తన ప్రతిభా పాటవాలతో అలరించాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగే కంటే ముందు ముగింపు వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా లక్షకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది ఓ రికార్డుగా నమోదైంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పాడిన పాటలు ఉర్రూత లూగించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్(Ranveer IPL 2022) డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు.
ఈ సందర్భంగా స్టేడియంలో భారతీయ మువ్వెన్నల జెండాలు రెప రెప లాడాయి. మేరా భారత్ మహాన్ అన్న నినాదాలతో మార్మోమ్రోగింది.
ఇక రెహమాన్ గొంతులోంచి జాలు వారిన వందే మాతరం హిట్ సాంగ్ మరోసారి పాడడంతో స్టేడియంలో జెండాలతో పాటు జనం వరుస కలిపారు. వినోద కార్యక్రమాలు ఐపీఎల్ ఫైనల్ కు హైలెట్ గా నిలిచాయి.
ఇక మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయనను కలిసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఇరు జట్ల కెప్టెన్లు అసలైన ఆట ఆడుతామంటూ ప్రతిజ్ఞ చేశారు.
సాయంత్రం వేళ స్టేడియం చప్పట్లతో, ఈలలతో దద్దరిల్లి పోయింది. నరేంద్ర మోదీ మైదానంలో యాక్షన్ , డ్రామా, బాణా సంచా ప్రదర్శన తో ఆకట్టుకుంది.
రెహమాన్(Ranveer & Rahman IPL 2022) ప్రసిద్ది చెందిన ఆస్కార్ అవార్డు సాంగ్ జై హో అంటూ పాడడంతో ఒక్కసారిగా స్టేడియం చప్పట్లతో మోగింది. 75 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో సునీల్ గవాస్కర్ , సచిన్ , రాహుల్ ద్రవిడ్ చిత్రాలను ప్రదర్శించారు.
Also Read : ఐపీఎల్ ఫైనల్ లో అక్షయ్ హల్ చల్