Ajinkya Rahane : అత‌డి ఆటే కాదు వ్య‌క్తిత్వం భేష్

ర‌హానే మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్

Ajinkya Rahane : అజింక్యా ర‌హానే పుట్టిన రోజు ఇవాళ‌. ప్ర‌తి క్రికెట‌ర్ కు ఎప్పుడో ఒక‌ప్పుడు ఇబ్బంది ఏర్ప‌డ‌డం ఖాయం. అది ఫామ్ రూపంలో. ఈ మ‌రాఠా యోధుడి గురించి చెప్ప‌కుండా ఉండ‌లేం.

ఆస్ట్రేలియా సీరీస్ లో ఆసిస్ కు ఆ దేశంలోనే చుక్క‌లు చూపించిన తాత్కాలిక సార‌థి ర‌హానే. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ అది ఒక చిర‌స్మ‌ర‌ణీయ‌మైన క‌థ‌గా మిగిలి పోతుంది.

దిగ్గ‌జ ఆట‌గాళ్లు లేక పోయినా ప‌రిమితుల‌కు లోబ‌డి త‌న‌కు అందుబాటులో ఉన్న వారితోనే జ‌ట్టును న‌డిపించాడు. సీరీస్ నెగ్గేలా చేశాడు. యావ‌త్ భార‌త‌మే కాదు క్రికెట్ ప్ర‌పంచం కూడా విస్తు పోయింది భార‌త జ‌ట్టు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసింది.

36 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన ఈ జ‌ట్టేనా ఇలా ఎలా సీరీస్ ఎగ‌రేసుకు పోయింద‌ని క్రికెట్ పండితులు నోళ్లు వెళ్ల‌బెట్టారు. కానీ ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాడు ర‌హానే. ఇప్ప‌టికే ఎప్ప‌టికీ గుర్తుండి పోయే స‌న్నివేశం అది.

భార‌త క్రికెట్ జ‌ట్టుకు మూల స్తంభంలా ఉన్నాడు. ఒక‌ప్పుడు రాహుల్ ద్ర‌విడ్ త‌ర్వాత అదే ప్లేస్ లో న‌మ్మ‌క‌మైన బ్యాట‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

కానీ గ‌త కొంత కాలంగా ఆట‌లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా ఇబ్బంది ప‌డ్డాడు. చివ‌ర‌కు జ‌ట్టులో చోటు కోల్పాయాడు.

విచిత్రం ఏమిటంటే బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఎవ‌రూ తీసుకోని స‌మ‌యంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ అత‌డిని ఎంపిక చేసుకుంది.

గాయం కార‌ణంగా ఆడ‌లేక పోయాడు. ఇటీవ‌లే కొత్త కారు కొన్నాడు. అజింక్యా ర‌హానే(Ajinkya Rahane) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. విజ‌యం సాధించిన‌ప్పుడు పొంగి పోడు.

ఓట‌మి సంభ‌వించిన‌ప్పుడు కుంగి పోడు. ప్ర‌తి దానిని స‌మ‌దృష్టితో చ‌డ‌టం అల‌వాటుగా మార్చుకున్నాడు. అందుకే అతడిని తెలిసిన క్రికెట‌ర్లు

అంతా మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అంటుంటారు.

అత‌డికి ఆట అంటే ఎంతో అభిమానం. అంత‌కంటే ర‌హానే(Ajinkya Rahane) కు భార‌త‌దేశం అంటే ఎన‌లేని గౌర‌వం. అందుకే స‌మున్న‌త

భార‌త ప‌తాకానికి విన‌మ్రంగా న‌మ‌స్క‌రించాడు.

ఆట కంటే దేశం గొప్ప‌ద‌ని చాటిన ఈ క్రికెట‌ర్ మ‌న మ‌ధ్య ఉండ‌డం మ‌న అదృష్టం. గాయం నుంచి కోలుకోవాల‌ని, తిరిగి భార‌త్ కు ఆడాల‌ని ఆశిద్దాం.

సెహ్వాగ్ అన్న‌ట్టు అత‌డిని త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. కానీ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. విజేత‌గా నిలిచాడు.

Also Read : ఆ ముగ్గురు బౌల‌ర్లే నాకు ఆద‌ర్శం

Leave A Reply

Your Email Id will not be published!