Rashid Khan : అరుదైన ఘ‌న‌తకు అడుగు దూరం

100 వికెట్ల ఫీట్ కు ఒక వికెట్ దూరం

Rashid Khan : గుజ‌రాత్ టైటాన్స్ త‌రపున ఆడుతున్న ఆఫ్గనిస్తాన్ స్టార్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) అరుదైన ఘ‌న‌త‌కు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. 100 వికెట్ల‌కు కేవ‌లం ఒకే ఒక వికెట్ దూరంలో ఉండ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ఐపీఎల్ 99 వికెట్లు తీశాడు. 2017లో 18 ఏళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) లో అరంగేట్రం చేశాడు. ఆ సీజ‌న్ ను 17 వికెట్ల‌తో ముగించాడు.

ఐదేళ్ల కాలంలో ప్ర‌తి ఏటా త‌న ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నాడు. అద్భుత‌మైన స్పిన్న‌ర్ గా పేరొందాడు ర‌షీద్ ఖాన్. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక క్రికెట్ స్టార్ ల‌సిత్ మ‌లింగ త‌ర్వాత మైలు రాయిని సాధించిన రెండో అత్యంత వేగ‌వంత‌మైన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు.

ఇక ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా గురువారం గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్ టేబుల్ లో టాప్ లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇక ర‌షీద్ ఖాన్ ఆఫ్గ‌నిస్తాన్ తూర్పు భాగంలో ఉన్న నంగ‌ర్ హార్ లో పుట్టాడు. 2015లో జింబాబ్వేపై వ‌న్డే మ్యాచ్ తో త‌న క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఏడాదిన్న‌ర త‌ర్వాత ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ. 4 కోట్ల‌కు ర‌షీద్ ఖాన్(Rashid Khan) ను తీసుకుంది. టీ20 లీగ్ కు ఎంపికైన ఇద్ద‌రు మొట్ట‌మొద‌టి ఆఫ్గ‌న్ ఆట‌గాళ్ల‌లో ర‌షీద్ ఖాన్ కూడా ఉన్నాడు.

ఇక బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో ర‌షీద్ ఖాన్ ను గుజ‌రాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ చేజిక్కించుకుంది. ఇదిలా ఉండ‌గా ఖాన్ ఎస్ ఆర్ హెచ్ త‌ర‌పున 76 మ్యాచ్ లు ఆడాడు 93 వికెట్లు తీశాడు. ఇక గుజ‌రాత్ నుంచి ఆడుతూ 6 వికెట్లు తీశాడు.

Also Read : గుజ‌రాత్ కు షాక్ హైద‌రాబాద్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!