AB De Villiers Rashid Khan : టి20ల్లో రషీద్ ఖాన్ టార్చ్ బేరర్
అతడే మ్యాచ్ విన్నర్ అన్న డివిలియర్స్
AB De Villiers Rashid Khan : ప్రపంచ క్రికెట్ లో ఏబీ డివిలియర్స్ మోస్ట్ పాపులర్ స్టార్ క్రికెటర్. పరుగులను అలవోకగా , అత్యంతగా వేగంగా సాధించడంలో మనోడి తర్వాత ఎవరైనా. త్వరలో భారత్ లో టి20కి సంబంధించిన ఐపీఎల్ జరగనుంది. ఈ సందర్బంగా ఏబీ డివిలియర్స్ కీలక కామెంట్స్ చేశాడు.
టి20ల్లో అత్యుత్తమ ప్లేయర్ ఎవరు అన్న ప్రశ్నకు సంచలన జవాబు ఇచ్చాడు. తన ఛాయిస్ ఆష్గనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్(Rashid Khan) అని , అతడు రియల్ టార్చ్ బేరర్ అంటూ కితాబు ఇచ్చాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
రషీద్ ఖాన్ బెస్ట్ బౌలరే కాదు అద్భుతమైన ఆల్ రౌండర్ కూడా. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దమ్మున్నోడు రషీద్ ఖాన్ అంటూ పేర్కొన్నాడు డివిలియర్స్(AB De Villiers Rashid Khan). తన మాజీ ఆర్సీబీ సహచరులైన విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ కాదని కుండ బద్దలు కొట్టాడు.
ఎందుకంటే ఏ సమయంలోనైనా మ్యాచ్ ఫలితాలను తారు మారు చేసే సత్తా రషీద్ ఖాన్ కు ఉందని మగతా ఆర్సీబీ ప్లేయర్లకు లేదని స్పష్టం చేశాడు డివిలియర్స్.
టి20 క్రికెట్ చరిత్రలో ఖాన్ అత్యుత్తమ ఆటగాడు అని తాను వేరే వాళ్లను చెప్పదల్చు కోలేదని పేర్కొన్నాడు . బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తాడు..బ్యాటింగ్ లో దుమ్ము రేపుతాడు..ఫీల్డింగ్ లో సింహం లాగా కదులుతూ ఉంటాడని తెలిపాడు ఏబీ డివిలియర్స్.
2017లో ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లో చేరాడు. 14 మ్యాచ్ లలో 17 వికెట్లు తీశాడు. 2021 వరకు ఆ జట్టుతోనే ఉన్నాడు 93 వికెట్లు తీశాడు. ఈసారి గుజరాత్ టైటాన్స్ లో చేరాడు. 19 వికెట్లు తీశాడు. 77 మ్యాచ్ లలో 126 వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు రషీద్ ఖాన్(Rashid Khan).
Also Read : ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ