Rashid Khan : శుభ్ మ‌న్ గిల్ ద‌మ్మున్నోడు – ర‌షీద్ ఖాన్

అత‌డికి బౌలింగ్ చేయ‌డం చాలా క‌ష్టం

Rashid Khan : ప్ర‌పంచ క్రికెట్ లో మోస్ట్ పాపుల‌ర్ గా పేరొందిన ఆఫ్గ‌నిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఎంతో మంది బ్యాట‌ర్లు అత‌డి బౌలింగ్ లో ఆడేందుకు ఇబ్బంది ప‌డ‌తారు.

ఇదిలా ఉండ‌గా మీరు ఎవ‌రికి బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది ప‌డ‌తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఒకే ఒక్క‌డి పేరు చెప్పాడు. విచిత్రం ఏమిటంటే స‌ద‌రు ప్లేయ‌ర్ ఎవ‌రో కాదు తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన శుభ్ మ‌న్ గిల్.

ఇద్ద‌రూ ఒకే జ‌ట్టు త‌ర‌పున ఆడారు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది ప్లేయ‌ర్ల‌కు బౌలింగ్ చేశాన‌ని, చాలా సార్లు బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాన‌ని కానీ త‌న బౌలింగ్ ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే స‌త్తా క‌లిగిన ఏకైక బ్యాట‌ర్ మాత్రం భార‌త క్రికెట్ కు చెందిన శుభ్ మ‌న్ గిల్ ఒక్క‌డేన‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు ర‌షీద్ ఖాన్(Rashid Khan).

ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ వైడ్ గా ర‌షీద్ ఖాన్ బౌలింగ్ లో ఆడేందుకు నానా తంటాలు ప‌డ‌తారు దిగ్గ‌జ ఆట‌గాళ్లు. అంతెందుకు ఈసారి జ‌రిగిన ఐపీఎల్ 2022లో ప‌రుగుల వ‌ర‌ద పారించి రూ. 95 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ కొట్టేసిన స్టార్ హిట్ట‌ర్,

ఇంగ్లండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా ర‌షీద్ ఖాన్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశాడంటే ఎంత ప‌వ‌ర్ ఫుల్ అనేది అర్థం చేసుకోవ‌చ్చు.

ఈసారి ర‌షీద్ ఖాన్(Rashid Khan) 19 మ్యాచ్ లు ఆడాడు. 19 వికెట్లు తీశాడు. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

చివ‌ర‌కు ఆ జ‌ట్టే ఐపీఎల్ టైటిల్ విజేత‌గా నిలిచింది. కాగా ఇప్పుడు ర‌షీద్ ఖాన్ చేసిన కామెంట్స్ తో గిల్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు.

Also Read : కోహ్లీ అన్ని కాలాల్లో అత్యుత్త‌మ క్రికెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!