Rashid Latif : ఉమ్రాన్ మాలిక్ కు భ‌విష్య‌త్తుంది

మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ కితాబు

Rashid Latif : ఎవ‌రీ ఉమ్రాన్ మాలిక్ అనుకుంటున్నారా. ఐపీఎల్ 2022లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో చుక్క‌లు చూపించాడు.

క‌ళ్లు చెదిరేలా బంతుల్ని వేశాడు. టి. న‌ట‌రాజ‌న్ తో క‌లిసి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కోల్ క‌తా పై హైద‌రాబాద్ విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఉమ్రాన్ మాలిక్ రెండు కీల‌క వికెట్లు తీశాడు. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ (Rashid Latif)  ఉమ్రాన్ మాలిక్ ను ఆకాశానికి ఎత్తేశాడు.

భ‌విష్య‌త్తులో యువ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణించ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ పేస‌ర్ సూప‌ర్ గా బౌలింగ్ చేస్తున్నాడంటూ పేర్కొన్నాడు ర‌షీద్ ల‌తీఫ్‌.

ఫైరీ స్పెల్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. నాలుగు ఓవ‌ర్ల‌లో 27 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 175 కు ప‌రిమితం చేసింది హైద‌రాబాద్.

ఇలా క‌ట్ట‌డి చేయ‌డంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లు న‌ట‌రాజ‌న్ , ఉమ్రాన్ మాలిక్ లు కీల‌క పాత్ర పోషించాడు. ఉమ్రాన్ మాలిక్ 28 ప‌రుగుల వ‌ద్ద ఉన్న స‌మ‌యంలో అద్భుత‌మైన యార్క‌ర్ తో కేకేఆర్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ను అవుట్ చేశాడు.

ఉమ్రాన్ భార‌త జ‌ట్టుకు రాబోయే సంవ‌త్స‌రంలో త‌న‌కంటూ ఓ పేరు తెచ్చుకోగ‌ల‌ని ధీమా వ్య‌క్తం చేశాడు ర‌షీద్ లతీఫ్‌(Rashid Latif). ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఉమ్రాన్ ను ప‌రిశీలించాల‌ని బీసీసీఐకి సూచించాడు.

Also Read : హ‌మ్మ‌య్య ‘ముద్దుగుమ్మ’ న‌వ్వింది

Leave A Reply

Your Email Id will not be published!