Rashmi Thackeray : ఉద్దవ్ ఠాక్రేకు అండగా భార్య రష్మీ ఠాక్రే
ఎమ్మెల్యేల భార్యలను మద్దతు ఇవ్వాలని విన్నపం
Rashmi Thackeray : మహారాష్ట్రలో చోటు చేసుకున్న సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరో వైపు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు మరాఠా డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
సోమవారం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఇంకో దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల రంగంలోకి దిగాలంటూ సవాల్ విసిరారు సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రే.
ఇదే క్రమంలో శివసేన పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆరు తీర్మానాలు చేసింది. ప్రధానంగా శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే పేరు ఒక్క తాము తప్ప ఎవరూ వాడుకోకూడదని తీర్మానం చేసింది పార్టీ.
ఇదే విషయాన్ని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్. ఇదే సమయంలో ధిక్కార స్వరం వినిపించిన మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఒడిశా లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు.
ఈ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులను శివసేన కార్యకర్తలు టార్గెట్ చేయడం, దాడులకు పాల్పడడంతో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న తన భర్త, సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అండగా నిలుస్తున్నారు రష్మీ ఠాక్రే(Rashmi Thackeray).
ఆమె రెబల్స్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారి భార్యలను తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read : మరాఠా డిప్యూటీ స్పీకర్ నిర్ణయం కీలకం