Rashmika Mandanna : విజయ్ దేవరకొండపై రష్మిక కామెంట్స్
డేటింగ్ చేస్తున్నారన్న దానిని ఎంజాయ్ చేస్తా
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో తన రిలేషన్ షిప్ గురించి స్పందించారు ప్రముఖ నటి రష్మిక మందన్నా. వారిద్దరూ పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. లైగర్ స్టార్ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నారా అనే పుకార్లను ధ్రువీకరించ లేదు లేదా ఖండించ లేదు.
ప్రజలు ఏమైనా మన గురించి మాట్లాడగలరంటూ పేర్కొన్నారు రష్మిక మందన్న. వారిని సాధ్యమైనంత వరకు తాను నవ్వించడానికే ఇష్ట పడతానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
పరుశురామ్ దర్శకత్వంలో రష్మిక, దేవరకొండ కలిసి గీత గోవిందం సినిమాలో నటించారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత రష్మిక, విజయ్ కలిసి డియర్ కామ్రేడ్ లో నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. కానీ ఖండిస్తూ వచ్చారు.
ఇటీవల వీరిద్దరూ రెస్టారెంట్ లలో కనిపించారు. ప్రస్తుతం నేను చాలా సినిమాలలో నటిస్తున్నా. కానీ ఇంత కాలం గడిచినా నన్ను డేటింగ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు.
మీ వ్యక్తిగత జీవితం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మేము నటులమని మీరు ముందు తెలుసుకోవాలని అన్నారు రష్మిక మందాన్న(Rashmika Mandanna). నేను ఏమీ దాచుకోను..స్వయంగా ఎవరి ప్రేమలో పడ్డాననేది ప్రకటిస్తానని చెప్పారు ఆమె.
ఇదిలా ఉండగా రష్మిక నటించిన పుష్ప రాజ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read : అదంతా అబద్దం ఆ మూవీలో నేనున్నా