Rashmika Mandanna : పొట్టి డ్రెస్ తో రష్మిక పరేషాన్
ఇబ్బంది పడిన స్టార్ హీరోయిన్
Rashmika Mandanna : పరుశురామ్ తీసిన గీత గోవిందంతో తెలుగింటి అమ్మాయిలా అలరించి, పుష్ప మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కన్నడ బ్యూటీ రష్మిక మందాన హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైంది ముంబైలో. ఈ సందర్భంగా రష్మిక మందన(Rashmika Mandanna) వేసుకున్న డ్రెస్ ఇప్పుటు చర్చకు దారి తీసింది.
ఆ డ్రెస్ అదిరేలా ఉన్నప్పటికీ నడిచేందుకు తెగ ఇబ్బంది పడి పోయింది. ఒక రకంగా చెప్పాలంటే సగం డ్రెస్ తో ఉన్నట్టు అనిపించింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
ఇదేం పద్దతి అంటూ మండి పడుతున్నారు. హీరోయిన్ల జాబితాలో టాప్ లో ఉన్న నీవు ఇలాగేనా వ్యవహరించేది అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందాన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో ఆమె నడవలేక పొట్టి డ్రెస్ తో ఇబ్బంది పడుతున్న వీడియో కూడా హల్ చల్ చేస్తోంది.
అందం అనేది ప్రదర్శించడానికి కాదు దాచు కోవడానికి అన్న విషయం అర్థంకాక పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆమెను తెగ ప్రేమించే వాళ్లు మాత్రం అందం చూడవయా ఆనందించ వయా అని కవి ఇలాంటి వాళ్లను చూసే రాశాడని అంటున్నారు.
మొత్తంగా సినిమా అంటే ఏమిటో కానీ రియల్ గా ఇలాంటి సన్నివేశాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయన్నది వాస్తవం. ఇక రష్మిక(Rashmika Mandanna) తెలుగు, తమిళం, హిందీలో ఫుల్ బిజీగా ఉంది.
Also Read : ఎవరీ రితికా నాయక్ ఏమిటా కథ