Ravi Shastri : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. తాను ఆడిన ఆటగాళ్లలో శ్రీకాంత్ లేదా సునీల్ మనోహర్ గవాస్కర్ లలో ఎవరు బెస్ట్ ఓపెనర్ పార్ట్ నర్ అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు రవిశాస్త్రి(Ravi Shastri ).
తన కెరీర్ లో ఎంతో మందితో ఓపెనింగ్ చేశానని కానీ అత్యంత సౌకర్యవంతంగా తనకు ఉన్నది మాత్రం సన్నీనేనని స్పష్టం చేశాడు. గవాస్కర్ బెస్ట్ ఓపెనర్ అంటూ తెలిపాడు.
తన అభిమాన భాగస్వామి మాత్రం సన్నీనేనని తెలిపాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఇప్పటికీ గవాస్కర్ ను పేర్కొంటారు. ఆయనతో కలిసి ఆడడం తన అదృష్టమన్నాడు రవిశాస్త్రి(Ravi Shastri ).
1983 ప్రపంచ కప్ విజేతతో బ్యాటింగ్ చేసేందుకు ఏ ఆటగాడైనా ఆడేందుకు సిద్దంగా ఉంటాడని తెలిపాడు. తాను శ్రీకాంత్ తో కంటే గవాస్కర్ తో ఓపెనింగ్ చేసే సమయంలో క్రికెట్ ఆటను పూర్తిగా ఆస్వాదించానని చెప్పాడు.
అలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడితో కలిసి ఆడడమే కాదు పరుగులు చేయడం చెప్పలేని అనుభూతి కలిగించిందన్నాడు రవిశాస్త్రి. సన్నీ మొదటి సారిగా 1971లో క్వీన్స్ పార్క్ ఓవల్ లో ఇంగ్లండ్ తో జరిగిన రెడ్ బాల్ గేమ్ లో భారత దేశం తరపున ఆడాడు.
1987లో వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆయన తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. భారత్ తరపున 125 టెస్టుల్లో 10 వేల 122 పరుగులు చేశాడు. 108 వన్డేల్లో 3092 రన్స్ చేశాడు.
34 టెస్ట్ సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడైన ప్లేయర్ గా పేరొందాడు గవాస్కర్. విండీస్ పేసర్లను ధైర్యంగా ఎదుర్కొన్న ఆటగాళ్లలో సన్నీ ఒకడు.
Also Read : వారెవ్వా వార్నర్ మామా