Ravi Shastri Audi 100 : గెలుపు ప‌దిలం బ‌హుమానం అపురూపం

ఆడి 100 కారు ఫోటోలు షేర్ చేసిన ర‌విశాస్త్రి

Ravi Shastri Audi 100 : భార‌త క్రికెట్ జ‌ట్టు విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు ర‌విశాస్త్రి. ఆ త‌ర్వాత టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. అత్య‌ధిక గెలుపులు సాధించేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ర‌విశాస్త్రి(Ravi Shastri Audi 100) నెట్టింట్లో వైర‌ల్ గా మారాడు. ఎందుకంటే తాను అందుకున్న ఆడి 100 కారు ఫోటోల‌ను షేర్ చేశాడు. ఇందుకు సంబంధించి ఆనాటి అపురూప‌మైన జ్ఞాప‌కాన్ని ఈ సంద‌ర్భంగా పంచుకున్నాడు.

1985లో ప్ర‌పంచ క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ లో భార‌త్ అద్భుతంగా ఆడింది. ఈ టోర్నీ మొత్తంలో ర‌విశాస్త్రి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా ఎంపిక‌య్యాడు.

ఈ సంద‌ర్భంగా ర‌విశాస్త్రికి ఆడి 100(Ravi Shastri Audi 100) కారు వ‌రించింది. బ‌హుమానంగా ద‌క్కింది. దానిని ఇప్ప‌టికీ త‌న గ్యారేజ్ లో పెట్టుకున్నాడు. తాను సాధించిన ప్ర‌తిభ‌కు ఇది ఎప్ప‌టికీ జ్ఞాప‌కంగా మిగిలి పోతుంద‌ని పేర్కొన్నాడు ర‌విశాస్త్రి.

ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా జ‌రిగిన టోర్నీలో సునీల్ గ‌వాస్క‌ర్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు బ‌హూక‌రించిన ఆడి 100 కారును ఉద్దేశించి ర‌విశాస్త్రి ట్వీట్ చేశాడు. దాని కింద అద్భుత‌మైన క్యాప్ష‌న్ కూడా జోడించాడు. ఇది పొంద‌గ‌లిగేంత వ్యామోహం..ఇది జాతీయ ఆస్తి అంటూ పేర్కొన్నాడు.

ఈ ఐకానిక్ టోర్నీలో 5 మ్యాచ్ ల‌లో 182 ర‌న్స్ చేశాడు 8 వికెట్లు తీశాడు. క్రికెట్ కామెంటేట‌ర్ గా కూడా రాణించాడు ర‌విశాస్త్రి. భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. 43 టెస్టులు ఆడ‌గా 25 గెలిచి 13 ఓడి పోయింది.

Also Read : కోహ్లీ..రోహిత్ రాణించ‌క పోతే క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!