Ravi Shastri : బౌల‌ర్ల వైఫ‌ల్యం రాజస్తాన్ కు శాపం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ర‌విశాస్త్రి

Ravi Shastri : కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌యిర్ -1 మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌ధానంగా డేవిడ్ మిల్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

ఆఖ‌రు ఓవ‌ర్ లో ప్ర‌సిద్ధ్ కృష్ణ వేసిన ఓవ‌ర్ లో ఏకంగా మూడు సిక్స‌ర్లు బాదాడు. త‌న జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. ఇదే స‌మ‌యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీల‌క ఇన్నింగ్స్ తో మెరిశాడు.

మొత్తంగా అద్భుత‌మైన స్కోర్ చేసినా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓడి పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిట‌నే దానిపై భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి(Ravi Shastri) స్పందించాడు. పూర్తిగా బౌల‌ర్లనే త‌ప్పు ప‌ట్టాడు.

అద్భుత‌మైన బౌల‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ స‌రైన స‌మ‌యంలో ఉప‌యోగించు కోలేక పోయార‌ని మండిప‌డ్డారు. జోస్ బట్ల‌ర్, సంజూ శాంస‌న్ రాణించినా ఓ మోస్త‌రు స్కోర్ చేసినా చివ‌రి దాకా నెట్టుకు వ‌చ్చార‌ని పేర్కొన్నాడు.

కానీ బూడిద‌లో పోసిన ప‌న్నీరు లాగా బౌల‌ర్లు ప‌ట్టించు కోలేద‌న్నారు. మ్యాచ్ ముగిసిన వెంట‌నే స్పందించే ర‌విశాస్త్రి ఎందుక‌నో నోరు మెద‌ప‌లేదు.

క్వాలిఫ‌యిర్ -1 మ్యాచ్ పూర్తిగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో ఉండింద‌ని, కానీ బౌల‌ర్ల‌ను వాడు కోవ‌డంలో కెప్టెన్ సంజూ శాంస‌న్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు ర‌విశాస్త్రి(Ravi Shastri).

గ‌త మ్యాచ్ ల‌లో అద్భుతంగా రాణించిన యుజ్వేంద్ర చ‌హ‌ల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సిద్ద్ కృష్ణ రాణించ‌క పోవ‌డం కూడా పెద్ద అడ్డంకిగా మారింద‌న్నారు ర‌విశాస్త్రి. ట్రెంట్ బౌల్ట్ , మెక్ కాయ్ ఉన్నా ఎందుకూ ప‌నికి రాకుండా పోయారంటూ మండిప‌డ్డారు.

Also Read : వ‌రించిన అదృష్టం బెంగ‌ళూరు విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!