Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్

150 వికెట్లు ప‌డగొట్టిన స్పిన్న‌ర్

Ravichandran Ashwin : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ -2022లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టి దాకా జ‌రిగిన మ్యాచ్ ల‌న్నీ నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి.

ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు గురించి. ఆ జ‌ట్టుకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నాడు శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం , మాజీ కెప్టెన్ కుమార సంగ‌క్క‌ర‌.

అత‌డితో పాటు మ‌రో శ్రీ‌లంక స్టార్ ప్లేయ‌ర్ ర‌సిత్ మ‌లింగ బౌలింగ్ కోచ్ గా చేరాడు. ఇవాళ ఆ జ‌ట్టు అనూహ్య‌మైన విజ‌యాలు న‌మోదు చేస్తూ వ‌స్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జ‌ట్టు చేసిన స్కోరే అత్య‌ధిక స్కోర్ గా న‌మోదైంది. 222 ర‌న్స్ చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు వ్య‌తిరేకంగా జ‌రిగిన మ్యాచ్ లో.

ఇక త‌క్కువ స్కోర్ కే అద్భుత‌మైన బౌలింగ్ ప‌ర్ ఫార్మెన్స్ తో క‌ట్ట‌డి చేసి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు చుక్క‌లు చూపించింది. ఏకంగా 29 ప‌రుగుల తేడాతో ఓడించింది.

ఈ సంద‌ర్భంగా అరుదైన స‌న్నివేశం నెల‌కొంది. భార‌త క్రికెట్ లో స్టార్ స్పిన్న‌ర్ గా పేరొందిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin)ఈసారి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడుతున్నాడు.

అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో వికెట్లు తీస్తూ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నాడు. బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్ లో అశ్విన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

ఏకంగా 150 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించాడు. ర‌జ‌త్ పాటిదార్ ను అవుట్ చేసి ఈ ఫీట్ నెల‌కొల్పాడు. అశ్విన్ మాయాజాలానికి బౌల్డ్ అయ్యాడు. కాగా ఐపీఎల్ లో 150 వికెట్లు తీసిన రెండో స్పిన్న‌ర్ గా రికార్డు బ్రేక్ చేశాడు.

Also Read : కోహ్లీ ఐపీఎల్ ను వ‌దిలేయ్ రెస్ట్ తీసుకో

Leave A Reply

Your Email Id will not be published!