Ravichandran Ashwin : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్ మెగా వేలంలో భాగంగా ఊహించని భారీ ధరకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin )ను.
ఇది ఏ జట్టు ఊహించ లేదు. ప్రస్తుతం ఆర్ఆర్ టీం ఈసారి ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్ లు ఆడింది మూడు మ్యాచ్ లలో గెలుపొందింది. ఒక మ్యాచ్ ను కోల్పోయింది.
ఈ తరుణంలో లీగ్ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో ఆఖరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది.
ఆఖరు ఓవర్ లో 19 పరుగులు కావాల్సి ఉండగా 3 రన్స్ తో ఓటమి పాలైంది. ఈ సందర్బంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మైదానంలోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఉన్నట్టుండి అవుట్ కాకుండానే పెవిలియన్ దారి పట్టాడు.
దీనని రిటైర్డ్ ఔట్ గా ప్రకటించారు అంపైర్. ఐపీఎల్ లో ఇదే మొదటిసారి కావడం. దీంతో దేశ వ్యాప్తంగా, క్రికెట్ లోకంలో రిటైర్డ్ ఔట్ అంటే ఏమిటే దానిపై చర్చ కొనసాగుతోంది.
దీనిపై స్పందించాడు రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin ). ఇది తాను స్వంతంగా తీసుకున్న నిర్ణయమని, మేనేజ్ మెంట్ ది కాదన్నారు. తనకు బదులు ఇంకొకరు వస్తే మరిన్ని రన్స్ వస్తాయనే నమ్మకంతో తాను తప్పుకున్నట్లు తెలిపారు.
ఈ సిస్టం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ లో జరగడం మామూలేనని వెల్లడించారు అశ్విన్.
Also Read : జోరు మీదున్న ఆర్సీబీ జోగుతున్న చెన్నై