Ravichandran Ashwin : బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అరుదైన ఘనత సాధించాడు. మూడో రోజు ఆటలో భాగంగా లంక క్రికెటర్ ధనంజయను ఔట్ చేశాడు.
దీంతో తన టెస్టు కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన సాధించాడు. ఏకంగా 440 వికెట్లు పడగొట్టాడు. సుదీర్గమైన ఫార్మాట్ లో బౌలర్ల జాబితాలో 8వ బౌలర్ గా నిలిచాడు. సఫారీ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ 93 టెస్టులు ఆడి 439 వికెట్లు తీశాడు.
స్టెయిన్ ను అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక రవిచంద్రన్(Ravichandran Ashwin) కేవలం 86 మ్యాచ్ ల లో ఈ ఘనత సాధించాడు. అంతే కాకుండా గతంలో రికార్డుల పేరుతో ఉన్న కీవీస్ మాజీ పేసర్ హ్యాడ్లీ సాధించిన 431 వికెట్లు, శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ 93 టెస్టుల్లో 433 వికెట్లు , భారత మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సాధించిన 434 వికెట్లను దాటేశాడు అశ్విన్.
ప్రస్తుతం ఓవర్ ఆల్ గా చూస్తే ఇప్పటి దాకా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో శ్రీలంక ఆటగాడు మురళీధరన్ 800 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
ఇక ఇటీవలే మరణించిన వార్న్ 708 వికెట్లతో , జేమ్స్ అండర్సన్ 640 వికెట్లతో ఉన్నాడు. కుంబ్లే 619 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్ఆడు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్ గ్రాత్ , వాల్ష్ ఉన్నారు.
రవిచంద్రన్ కు ఇంకా టెస్టులు ఆడే సత్తా ఉండడంతో భవిష్యత్తులో మరికొన్ని వికెట్లు పడగొట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా మన జట్టుకు చెందిన బౌలర్ ఈ ఘనత సాధించడం మనందరికీ గర్వకారణం.
Also Read : ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విక్టరీ