Rayadas Roy Manthena : దొర పాలనలో విద్య ఆగమాగం
ఎన్నారై రాయదాస్ రాయ్ మంథెన
Rayadas Roy Manthena : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఎన్నారై రాయదాస్ రాయ్ మంథెన. ట్విట్టర్ వేదికగా బుధవారం ఆయన తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కుతుందని మండిపడ్డారు. దొర మనవడికి చదువు కునేందుకు అవకాశం ఉంటుందని , కానీ మన పిల్లలకు మాత్రం ఎందుకు ఆ ఛాన్స్ రాదని ప్రశ్నించారు.
Rayadas Roy Manthena Comments on KCR
కుల ప్రాతిపదికన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి , టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు రాయదాస్ రాయ్ మంథెన(Rayadas Roy Manthena). కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద పెద్ద ఎత్తున కొన్నేళ్ల పాటు సేవలు అందిస్తున్నారని, వారిని ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో కేజీ టూ పీజీ అంటూ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎందుకు దాని ఊసెత్తడం లేదని నిలదీశారు . ప్రభుత్వ బడులు, కాలేజీలు, యూనివర్శిటీలు నిర్వీర్యమై పోయాయని మల్లారెడ్డి, పల్లా రెడ్డి, వరదా రెడ్డిలకు ప్రైవేట్ యూనివర్శిటీలు పెట్టుకునేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు రాయదాస్ రాయ్ మంథెన.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ