RBI : రైతన్నలకు..వ్యవసాయ రుణాలపై శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్

దేశంలోనిఅన్నదాతల్లో చిన్న, సన్నకారు రైతుల వాటా ఏకంగా 86 శాతం...

RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది. సవరించిన పరిమితి మేరకు బ్యాంకులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రైతులకు రుణాల మంజూరు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు ఈ నిర్ణయం మేలు చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

RBI Updates

దేశంలోనిఅన్నదాతల్లో చిన్న, సన్నకారు రైతుల వాటా ఏకంగా 86 శాతం. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులకు చిన్న రైతులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయం రైతన్నలకు లాభిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. తనఖా రహిత రుణ పరిమితి పెంచడం ద్వారా రైతులకు సమాయానికి రుణాలు అందుబాటులో ఉండేలా ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. పెరిగిన ఈ రుణ పరిమితి వ్యవసాయ అనుబంధ రంగాలకు వర్తిస్తుంది. రైతులు తమ ఆదాయ వనరులను విస్తరించుకునే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలకూ రుణ పరిమితిని పెంచారు. ఈ మేరకు రుణ నిబంధనల్లో మార్పులు చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. సవరించిన రుణాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని పేర్కొంది. తాజా మార్పుల గురించి రైతులకు తెలిసేలా బ్యాంకులు అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డు సహా వివిధ రుణాలను రైతులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు ప్రయత్నించాలని ఆర్‌బీఐ సూచించింది. తనఖా రహిత రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, తక్కువ వడ్డీ రుణాలు కలిసి రైతులకు సమయానికి ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Also Read : Minister Narayana : అమరావతి నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నారాయణ

Leave A Reply

Your Email Id will not be published!