RBI Repo Rate : ఆర‌వ సారి పెరిగిన రెపో రేటు

పెర‌గ‌నున్న గృహ‌..వ్య‌క్తిగ‌త‌..కార్ లోన్లు

RBI Repo Rate : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. మ‌రోసారి రెపో రేటు పెరిగింది. ఇలా పెర‌గ‌డం ఆరోసారి కావ‌డం విశేషం. భారీగా పెర‌గ‌నున్న గృహాలు, వ్య‌క్తిగ‌త‌, కార్ లోన్ల కు సంబంధించి వాయిదాలు పెర‌గ‌నున్నాయి. ఆర్బీఐ మూడు రోజుల పాటు మానిట‌రీ పాల‌సీ క‌మిటీ మీటింగ్ జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి 8న బుధ‌వారం మూడో రోజూ స‌మావేశం కొన‌సాగుతోంది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇప్ప‌టికే దేశాన్ని అదానీ గ్రూప్ సంస్థ నిర్వాకం కల‌కలం రేపుతోంది. అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ గ్రూప్ సంచ‌ల‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దెబ్బ‌కు భార‌త వ్యాపార రంగం కుదుపున‌కు లోనైంది. మ‌రో వైపు ఎల్ఐసీ, ఎస్బీఐతో పాటు ప్ర‌భుత్వ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడు గౌతమ్ అదానీ.

ఈ కీల‌క స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్. ఈ మేర‌కు 25 బేసిక్ పాయింట్లు పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. 6.25 నుంచి 6.50 శాతానికి రెపో రేటును(RBI Repo Rate) పెంచింది. ఇచ్చే రేటు ప్ర‌భుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు , ఇత‌ర రుణ సంస్థ‌లు అన్ని ర‌కాల రుణాల‌పై వ‌డ్డీ రేటును పెంచ‌డానికి వీలు క‌ల్పిస్తోంది.

కొత్త‌గా రుణాలు తీసుకునే వారు, ఇప్ప‌టికే రుణాలు తీసుకుని ఈఎంఐలను చెల్లిస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు శ‌క్తి కాంత దాస్. రెపో రేటు త‌గ్గిస్తార‌ని అనుకుంటే ఉన్న‌ట్టుండి పెంచ‌డంపై ఆర్బీఐ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : బింగ్ షాక్ ఇవ్వ‌డం ఖాయం – సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!