RBI Digital Rupee : ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయి స్టార్ట్
నాలుగు నగరాలలో ప్రారంభించిన ఆర్బీఐ
RBI Digital Rupee : కేంద్రంలో నరేంద్ర మోదీ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా కొలువు తీరారో ఆనాటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు, బడా సంస్థలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు చేసినా ఫలితం లేకుండా పోయింది.
భారతీయ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇదే సమయంలో టెలికాం రంగాన్ని శాసిస్తూ వస్తున్న టెలికాం కంపెనీలకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టింది. మొత్తం డిజిటల్ జపం చేస్తూ జనం నెత్తిన టోపీ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో ఇక నుంచి డిజిటల్ రూపంలో రూపాయి(RBI Digital Rupee) తీసుకు వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).
ఇప్పటి ఈ ఏడాది 2022 నవంబర్ 1 నుంచే హోల్ సేల్ విభాగంలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయిని ప్రారంభించింది. తాజాగా డిసెంబర్ 1 గురువారం నుంచి రిటైల్ ఉపయోగం కోసం ఇ రూపాయిని అమలులోకి తీసుకు వచ్చింది. మొదటగా ప్రయోగాత్మకంగా దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలు బెంగళూరు,
న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్ లలో డిజిటల్ రూపాయిని తీసుకు వస్తోంది. ఇక రిటైల్ డిజిటల్ రూపాయి వ్యాపారంలో మొదటగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) , ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు మరో నాలుగు బ్యాంకులు పాల్గొంటాయని ఆర్బీఐ వెల్లడించింది.
ఇదిలా ఉండగా డిజిటల్ రూపాయి డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుందని తెలిపింది. 10, 100, 200, 500 రూపాయల విలువతో ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. డిజిటల్ రూపాయికి డిజిటల్ వాలెట్ సిస్టమ్ ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.
Also Read : ప్రపంచ కుబేరుల్లో అదానీ..అంబానీ