RCB Rajat Patidar IPL : బెంగళూరుకు షాక్.. ఐపీఎల్‌కు రజత్ పాటిదార్ దూరం ?
RCB Rajat Patidar IPL : ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శకునం కలసి రావడం లేదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఆర్సీబీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే విల్ జాక్స్ లీగ్‌కు దూరం కాగా… జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం పూర్తి ఫిట్‌నెస్ సాధించని సంగతి తెలిసిందే. హసరంగ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండగా.. బ్యాటర్ రజత్ పాటిదార్ సైతం అదే బాటలో నడవనున్నాడు.
కాలి మడమ గాయంతో బాధపడుతున్న రజత్ పాటిదార్(RCB Rajat Patidar IPL) ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతడికి మూడు వారాల విశ్రాంతి అవసరమని నిపుణులు సూచించారు. ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించిన తర్వాత ఐపీఎల్ రెండో భాగంలో అతడు ఆడేది లేనిది తేల్చనున్నారు. ఆర్సీబీ క్యాంప్‌లో చేరడానికి ముందే రజత్ పాటిదార్‌కు గాయం కావడంతో.. అతడికి ఎన్‌సీఏ క్లియరెన్స్ తప్పనిసరి కానుంది.
రజత్ పాటిదార్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండటంతో.. బ్యాటింగ్ కాంబినేషన్ విషయంలో ఆర్సీబీ ఆలోచించాల్సి ఉంటుంది. పాటిదార్ జట్టులో ఉంటే.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. డుప్లెసిస్‌తో కలిసి న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్ లేదా అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ అనుజ్ రావత్ ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది.
Also Read : పంజాబ్ కింగ్స్ జానీ బెయిర్‌స్టో దూరం మాథ్యూ షార్ట్ కు చోటు