RCB vs LSG IPL 2023 : బెంగళూరు లక్నో పోరుకు సిద్ధం
ఇరు జట్లకు మ్యాచ్ కీలకం
RCB vs LSG IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది బెంగళూరు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయంట్స్ తో పోటీ పడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
ఇప్పటికే ఆర్సీబీ కోల్ కతా వేదికగా అనూహ్యమైన రీతిలో ఓటమి పాలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు చాప చుట్టేసింది. మరో వైపు లక్నో విజయంతో ఊపు మీదుంది. స్వంత మైదానంలో ఆర్సీబీ తన సత్తా చాటాలని చూస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడు మ్యాచ్ లలో రెండు గెలిచి ఒకటి ఓడి పోయంది. డెత్ బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది ఆర్సీబీకి. హర్షల్ పటేల్ , మహ్మద్ సిరాజ్ లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యారు.
జట్టును ఇదే పీడిస్తోంది. వనిందు హసరంగా , జోష్ హేజిల్ వుడ్ లేక పోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. రీస్ టోస్లీ స్థానంలో వచ్చిన మీడియం పేసర్ వేన్ పార్నెల్ పై ఆధారపడక తప్పదు ఆర్సీబీ(RCB vs LSG IPL 2023) . బ్యాటింగ్ పరంగా చూస్తే విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కీలకంగా మారనున్నారు. ఇక హైదరాబాద్ పై లక్నో 5 వికెట్ల తేడాతో విజయంం సాధించింది. యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆరు వికెట్లు తీస్తే అమిత్ మిశ్రా , కృనాల్ పాండ్యా మిగతా వికెట్లు పడగొట్టారు.
జట్ల పరంగా చూస్తే లక్నోకు రాహుల్ కెప్టెన్ కాగా మేయర్స్ , హుడా, పాండ్యా, మిశ్రా, పూరన్ , నవీన్ , బదోనీ, అవేష్ ఖాన్ ,కరణ్ శర్మ, చరక్ , ఠాకూర్ , షెఫర్డ్ , మార్క్ వుడ్ , స్వప్నిల్ , వోహ్రా , సామ్స్ , మన్కడ్ , గౌతమ్ , ఉనాద్కత్ , స్టోయినిస్ , బిష్ణోయ్ , మయాంక్ యాదవ్ ఉన్నారు.
ఇక ఆర్సీబీలో ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ కాగా కోహ్లీ, సిరాజ్ , పటేల్ , కార్తీక్ , షాబాజ్ , రావత్ , ఆకాశ్ దీప్ ,లోమ్రోర్ , అలెన్ , సుయాష్ , కర్ణ్ శర్మ, కౌల్ , విల్లీ , పార్నెల్ , హిమాన్షు , మనోజ్ , రాజన్ , అవినాష్ , సోనూ , మైకేల్ ఆడనున్నారు.
Also Read : మ్యాజిక్ చేసిన మయాంక్ మార్కండే