LIC IPO : భారత దేశంలో అతి పెద్ద కంపెనీగా, విశిష్ట సేవలందిస్తూ వస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ(LIC IPO )మే 4 నుంచి రానుంది. ఇది 9వ తేదీ వరకు కొనసాగనుంది.
ఇప్పటికే ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మేయడమో లేదా తమ వారికి కట్టబెడుతూ వస్తున్న కేంద్ర సర్కార్ కన్ను ఇప్పుడు ఎల్ఐసీపై పడింది. వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగి ఉంది ఈ సంస్థ.
దీని ధర రూ. 902 నుంచి 949 వరకు నిర్దేశించింది. ఇందులో భాగంగా 22.13 కోట్ల షేర్లు అమ్మకానికి పెట్టనుంది ఎల్ఐసీ. దీని ద్వారా రూ. 21, 000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో2.21 కోట్ల షేర్లు పాలసీదారులకు కేటాయించనుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3. 5 శాతం వాటాను విక్రయించనుంది. పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టరలకు షేరు ధరలో డిస్కౌంట్ సౌలభ్యాన్ని ఇచ్చింది.
ఇప్పటికే సెబీకి కూడా దరఖాస్తు చేసింది ఎల్ఐసీ. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మొదటి నుంచీ ప్రైవేటీకరణ చేస్తామంటూనే ప్రకటిస్తూ వస్తోంది. 15 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించింది.
రిటైల్ ఇన్వెస్టర్లు 15 షేర్లు చొప్పున దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కేంద్రం మొదటగా 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని అనుకుంది. కానీ రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా తగ్గింది.
ఎల్ఐసీ ప్రస్తుత విలువ రూ. 6 లక్షల కోట్లుగా నిర్ణయించింది కేంద్ర సర్కార్. సెబీ రూల్స్ ప్రకారం మొత్తం విలువలో కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేయాల్సి ఉంది. ఐపీఓ ముగిసిన వారం తర్వాత మే 17న స్టాక్ ఎక్ష్చేంజ్ లో నమోదు అయ్యే అవకాశం ఉంది.
Also Read : ఎలోన్ మస్క్ పై జాక్ డోర్సే కామెంట్